మేమింతే

వంశీ కలుగోట్ల // ... మేమింతే //
****************************
వందమందిని చంపిన ధీరనాయకుడి
కత్తి అంచున రక్తపు చుక్క జారినప్పుడు
నిక్కబోడుచుకున్న రోమాలకు
నిస్సహాయతతో నిస్తేజితులై
కన్నీరు కారుస్తున్న బాధా తప్తుల
కళ్ళు తుడవడానికి ఒక మనిషి
ముందుకు నడిస్తే చలనం ఉండదెందుకని

పరుగెత్తే ఆశ్వపుడెక్కల చప్పుడుకి 
బెదిరి అదిరినగుండెలు
ఆకలి అరుపులకి బరువెక్కవెందుకని
తండ్రి సంపాదనని కథానాయకుడు
తాగుడికి, తిరుగుళ్ళకి పోస్తే
లాజిక్కులు వెతకని మేధావిత్వం
అదే కథానాయకుడు తండ్రి సంపాదనని
ఊరి బాగుకోసం ఖర్చు పెట్టే దృశ్యాలను మాత్రం 
వెటకారపు నవ్వులతో వెక్కిరిస్తాయెందుకో

గ్రాఫిక్కుల మాయాజాలానికి
మత్తుతో బైర్లు గమ్మిన కళ్ళకు
పాడుబడిన పల్లె సౌందర్యం చూపితే
ఏం ఆనుతుందిలే - అది పల్లె కదా

మేమింతే త్రివిక్రమ్ చెప్పినట్టు
లాజిక్కులు కాదు మాజిక్కులే కావాలి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...