... నేనెంత బాధపడతానో

వంశీ కలుగోట్ల // ... నేనెంత బాధపడతానో //
**************************************
ఊరికే అంటావు కానీ
దేశం గురించి నాకేమీ పట్టదని
నేనెంత బాధపడతానో
నువ్వెప్పుడైనా ఆలోచించావా

మేమందరం ప్రతి శుక్రవారం
సాయంకాలం కలిసి చర్చిస్తాం 
మన మాతృదేశం ఏమైపోతోందో
ఆ పార్టీ కాకపొతే ఈ పార్టీ
వాడి వంశం కాకపొతే వీడి వంశం
తరాల దోపిడీ కొనసాగాల్సిందేనా అని 
సినిమా టికెట్ కొనడం దగ్గర నుంచి
ఇల్లు కొనడం వరకు ఎటు చూసినా
ప్రతి స్థాయిలోనూ అవినీతి
దేశమా ఏమిటీ దరిద్రం అని
గుండె బరువెక్కి ఏడవాలనిపిస్తుంది

రెండు పెగ్గులు విష్కీ తాగాక 
అప్పుడు నేనెంత బాధపడతానో 
దేశం గురించి నేనెంతగా ఆలోచిస్తానో
ఎంతగా వెక్కి వెక్కి ఏడుస్తానో
నువ్వెప్పుడైనా ఆలోచించావా

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...