... ఇవాళ విశ్రమిద్దాం
వంశీ కలుగోట్ల // ... ఇవాళ విశ్రమిద్దాం//
***************************************
తొలకరి వాన తడికి
పులకించిన పొలంలా
నీ తొలిముద్దుతో
పరవశించిన నేను
***************************************
తొలకరి వాన తడికి
పులకించిన పొలంలా
నీ తొలిముద్దుతో
పరవశించిన నేను
చిరుగాలి తాకిడికి
పరవశించిన ప్రకృతిలా
నా గాఢ పరిష్వంగనంలో
ఇమిడిపోయిన నువ్వు
పరవశించిన ప్రకృతిలా
నా గాఢ పరిష్వంగనంలో
ఇమిడిపోయిన నువ్వు
కురుక్షేత్ర యుద్ధానికి
రాయబారంతో బీజం వేసిన
కృష్ణ పరమాత్మలా
వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు
రాయబారంతో బీజం వేసిన
కృష్ణ పరమాత్మలా
వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు
యుద్ధభూమిలో
బలాబలాలు తేల్చుకుంటున్న
వైరి పక్షాలలా
మన సమాగమం
బలాబలాలు తేల్చుకుంటున్న
వైరి పక్షాలలా
మన సమాగమం
యుద్ధం ముగిశాక
అస్త్రాలు పక్కన పెట్టి
మిత్ర పక్షాలుగా మారిన రాజ్యాల్లా ...
సేదతీరుతున్న మనం
అస్త్రాలు పక్కన పెట్టి
మిత్ర పక్షాలుగా మారిన రాజ్యాల్లా ...
సేదతీరుతున్న మనం
నిరంతర సమరం
జరిపే సైన్యంలా
రేపటి యుద్ధం కోసం వేచి చూస్తూ
ఇవాళ విశ్రమిద్దాం ...
జరిపే సైన్యంలా
రేపటి యుద్ధం కోసం వేచి చూస్తూ
ఇవాళ విశ్రమిద్దాం ...
Comments
Post a Comment