Posts

Showing posts from May, 2016

గెలిచేవాడు ...

వంశీ కలుగోట్ల// గెలిచేవాడు ... // ****************************** ఒకడు డబ్బుకు పడతాడు ఒకడు అధికారానికి పడతాడు ఒకడు అమ్మాయికి పడతాడు బేసిగ్గా మగోడు అన్నాక దేనికో ఒకదానికి పడక తప్పదు దేనికి పడితే లాభమో దేనికి పడితే నష్టమో తెలుసుకున్నోడు గెలుస్తాడు ఓరి సాంబో రాస్కోరా ...

మనిద్దరమూ ...

వంశీ కలుగోట్ల // మనిద్దరమూ ... //  ***************************** ** నీదో కులం నాదో కులం ఉదయాన సూర్యుడిని చూసే సందర్భం మనిద్దరికీ వేరుగా ఉంటుంది  నువ్వు సూర్యుడిని పొలంలో నిలబడి  చెమట చుక్కలు తుడుచుకుంటూ చూస్తావు  అదే నేనైతే నది/వాగు నీటిలో నిలబడి  అర్ఘ్యం వదులుతూ చూస్తాను  నువ్వు వేరు నేను వేరు  కానీ, మనిద్దరి మధ్యా విభేదాలు పెరుగుతున్న  ఈ లోకానికి సూర్యుడొక్కడే   నీ దేవుడు వేరు నా దేవుడు వేరు  నేను స్నానం చేసి నా దేవుడికి దణ్ణం పెడతాను  నీవు స్నానం చేసి నీ దేవుడికి ప్రార్థన చేస్తావు  నా దేవుడు అన్నీ తానై అండ నిలబడతానంటాడు  నీ దేవుడు రక్తం చిందించి నీకోసం పోరాడాడు  నువ్వూ నేనూ ఇంకా మనలాంటి చాలామందీ దేవుడి గురించి కొట్టుకుంటూ పోతున్నారు  రోజుకో కొత్త దేవుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు  నీ దేవుడు వేరు నా దేవుడు వేరు  'ఏకం సత్ విప్రం బహుదా వదంతి' నీదో ప్రాంతం నాదో ప్రాంతం  నీ ప్రాంతంలో మనుషులు నేలమీద తిరుగుతారు  నా ప్రాంతంలో మనుషులు కూడా నేలమీదే నడుస్తారు  నీ ప్రాంతంలో దేవుడా అంటారు  నా ప్రాంతంలో భగవంతుడా అంటారు  అక్కడా మనుషుల

He never taught …

Vamsi Kalugotla // He never taught …// ****************************************** He never taught me anything He always lived the values he wanted to teach For him, success doesn’t mean winning against an enemy He always concentrated on bettering himself in his abilities He never said that winning means bettering yourself No need to confine yourself to the closed doors When you are humiliated for what you are, or failed to achieve He never said that if you can work and wait For sure tomorrow will be yours They, for sure say that you are in wrong way When you are doing the things in your own way He never said that you will be recognized better When you do it in your own way … Take my word, there will no one with you When you start your journey He never explained me the meaning behind ‘You will be everyone’s friend in your hey days’ He never tried to teach anything in specific He lived up to the values he believed at heart Not just me, dear dad – the heavens, w

నాన్న ఎప్పుడూ చెప్పలేదు

వంశీ కలుగోట్ల// నాన్న ఎప్పుడూ చెప్పలేదు //  ********************************************** నాన్న ఎప్పుడూ చెప్పలేదు  కేవలం చూపాడు అంతే  ప్రతీకారం తీర్చుకోవడం అంటే  పగవాడిని పడగొట్టటం కాదు  వాడికంటే మనం పైకెగదటం అని  అవమానమెదురైతే కుమిలిపోనక్కరలేదు  వేచి చూడగలిగితే అవకాశం వస్తుంది  అక్కడే మళ్ళీ మర్యాదలందుతాయి అని  ఊరుమ్మడి దారిలో ఉరకాల్సిన పని లేదు  నీ దారిలో వెళ్ళినా గుర్తింపు వస్తుంది అని  నీ అడుగులు మొదలైనప్పుడు  వీడేం చేస్తాడులే అంటూనే ఉంటారు  నువ్వు పైకెదిగినప్పుడు  'వాడు మనవాడే' అంటారు అని  నాన్న ఎప్పుడూ చెప్పలేదు  కానీ, చెప్పినట్టే అనిపిస్తుంది  'అరేయ్ నేను నేర్పింది పడటం కాదు  పడినప్పుడు లేవటం' అని 

I am a human being

Vamsi Kalugotla // I am a human being ... // *********************************************** I feel I am also a human being I think of the land where I live I think of the country where I was born I think of common people, they are the victims I always dream to change the system You always think that I am irresponsible You always complaint that I ignore You criticize me that I always think of my comforts only I do think of every other issue you talk about Haven't you seen the posts I have shared on social media Have't you checked my status messages on FB, twitter ... Still, do you think I am irresponsible ... I do support everyone who fight for common people An activist, reformer and so on, what not I am I do all great things, on my social media accounts My dear friend, do you know that … I too feel that I am a human being after a peg or two

వాడు నవ్వుతూనే ఉండాలి ...

వంశీ కలుగోట్ల// వాడు నవ్వుతూనే ఉండాలి ...// ****************************** **************** కొన్ని సంవత్సరాల క్రితం నాదో, మరింకొకరిదో పుట్టినరోజునాడు నేను విత్తు/మొక్క నాటుతుంటే వాడు చూసి వెటకారంగా నవ్వాడు నాది మూర్ఖత్వమన్నాడు నేను నీరు పోయడానికెళ్ళిన ప్రతిసారి వాడు నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు మూర్ఖత్వమని వెక్కిరిస్తూనే ఉన్నాడు సంవత్సరానికి ఒకసారి ప్రతి పుట్టినరోజు నాడు నేను కనిపించినప్పుడు నన్నూ ఆ మొక్కను చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుతూనే ఉన్నాడు మొక్క మానవలేదని వెక్కిరిస్తూనే ఉన్నాడు  ఈ రోజు, ఇన్ని సంవత్సరాల తరువాత ఆ విత్తు మొక్క నుండి మాను (చెట్టు) అయింది ఇప్పుడు కూడా వాడు నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు కానీ, ఇప్పుడు వాడి నవ్వులో నాకు వెటకారం కనిపించటం లేదు ఆ నవ్వులో కృతజ్ఞత కనిపిస్తోంది

పల్లెలను వదిలెయ్యండి ...

వంశీ కలుగోట్ల// పల్లెలను వదిలెయ్యండి ... // ****************************** ************** నగరం పేరు చెబితే  కొందరికి  బహుశా అభివృద్ధి గుర్తుకు వస్తుందేమో కానీ, ఆ అభివృద్ధి మాటున  ఆ నగరం మింగేసిన పల్లెలు ఎన్నో  పల్లెలంటే అమాయకత్వమే కాదు పల్లెలంటే చదువులేని తనం కాదు పల్లెలంటే పట్నాలను బతికించే ప్రాణవాయువులు పల్లెలంటే నగరాలకు తిండి పెట్టే పొలాలు  నచ్చకపోతే పల్లెలనుండి మనుషులను వలస పోమ్మనండి పల్లెలను పట్నాలను చెయ్యాలని మాత్రం ప్రయత్నాలు చెయ్యడం ఆపండి  మనుషులు లేకపోయినా పల్లెలు బతకగలవు కానీ పల్లెలు, పచ్చదనాలు లేని రోజున మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది

... Today, they are enemies

Vamsi Kalugotla // ... Today, they are enemies // ****************************** ********************* When he was still learning to do the things All the Five Elements were his friends He Slept under the Sky Breathed fresh Air throughout the day Bathed in the rivers, he drank purest Water from the lakes Cultivated Land for his food Took help of Fire to light his room and cook food * Someone told him That there is nothing in the agriculture lands (Earth) Believing in that, he ran behind money and rich today All his life, he was running behind unknown treasures In the end, his plate was empty and he was starving And, the day when his soul left the world Earth took him to her lap allowing his body to take rest forever * Someone told him That there is a need to occupy forests to build houses Believing in that, he cut all the greenery He got to know the relation between the trees and and air When he had to build the Oxygen chambers ... in those skyscrapers  * Someone told him That there is

... భస్మాసురులు

వంశీ కలుగోట్ల // ... భస్మాసురులు // ******************************* 1 పిలవడానికి పచ్చని చెట్టు లేదని అలిగి వెళ్ళిపోయిన మేఘం వైపు కొట్టేయబడిన వృక్షాల ఆనవాళ్ళు ఆశగా చూస్తూనే ఉన్నాయి ఇప్పటికీ 2 మిగిలిపోయిన ఆనవాళ్ళతో వృక్షాలు బతకలేక వాడిపోయిన మొక్కలు తమలో తామే విషాదంగా నవ్వుకుంటున్నాయి భస్మాసురుడి గాధను కథలుగా చెప్పుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్న మనిషిని చూసి విర్రవీగుతున్న మూర్ఖత్వపు విశ్వరూపాన్ని చూసి 3 పొరలు చీల్చుకుంటూ బయటకొచ్చే దశ నుండీ ప్రతిక్షణం పరిస్థితులతో పోరాడి నిలబడే విత్తు మొక్క నుండి మానుగా ఎదిగే పరిణామ క్రమంలో మనుగడకోసం ఎన్ని యుద్ధాలు చేస్తుందో  ప్రకృతికి ఎదురొడ్డి నిలబడగలిగింది కానీ అభివృద్ది సాదిస్తున్నామన్న ముసుగు మాటున సాగిన, సాగుతున్న మనిషి దాష్టీకానికి మాత్రం ఎదురు నిలబడటానికి శక్తి సరిపోక కూలిపోయి కనుమరుగవుతోంది ఆ పచ్చదనం 4 తన మూలాలు కదిలితే కానీ అర్థం కావట్లేదు ఆధునికుడికి అభివృద్ది అంటే ఎదిగి నిలబడేలా చేసేదే కానీ కూల్చి నాశనమయ్యేలా చేసేది కాదు అని

నువ్వొచ్చింది ...

నువ్వొచ్చింది ... ****************   ఒక చిన్న విషాదానికి      ... నువ్వు కృంగిపోవడం ఒక మామూలు సమస్యకు      ... నువ్వు బాధపడటం  వీల్లేదు మిత్రమా       ... వద్దు ఇవన్నీ నీలో కూడానా? అందరిలాగా ఏదో సాధించటానికో మరేదో చేయ్యటానికో ఇంకెవరి ఆశలకు బందీ కావటానికో ఇక్కడకు రాలేదు నిన్ను నీవు తెలుసుకో నీవు వచ్చింది చెప్పటానికి ... చూపటానికి మరో ఆలోచన మదిలోకి రానివ్వకు

నువ్వొక కవచానివి ...

వంశీ కలుగోట్ల// నువ్వొక కవచానివి ... // ********************************* *********** నువ్వంటే ఎవరో తెలుసా  నువ్వనుకునే నువ్వు నువ్వు కాదు  చేతికందిన రంగులన్నీ  అర్థం లేని ఆవేశంతో కాగితం మీద  నేను ఒలకబోసుకున్నప్పుడు  తయారయిన చిత్రానివి నువ్వు  నేను యుద్దానికి సిద్ధమైతే  నా ముందుండే సైన్యానివి నువ్వు  ఆవేశంతో నేను చెయ్యెత్తితే  ఆయుధమై చేరే రక్షణ నువ్వు  నేను బయటకెళ్ళేటప్పుడు వేసుకునే ముసుగువి నువ్వు  నువ్వు చంద్రగుప్తుడు లాంటివాడివైతే  నేను చాణక్యుడిలాంటివాడిని  నువ్వు రాయలు లాంటివాడివైతే  నేను తిమ్మరుసులాంటోడిని  నువ్వు వజ్రాయుధం లాంటివాడివి  నిన్ను వాడే ఇంద్రుడిలాంటోడిని నేను  నువ్వనుకునే నువ్వు నువ్వు కాదు  నేను తయారు చేసినబొమ్మవి నువ్వు  మాట నీదైతే అర్థం నాది  నీ వెనుక నడిచేది నిన్ను నమ్మి కాదు  ఏమి జరిగినా నువ్వు ముందుంటావని   నువ్వు నాయకుడివి కాదు మా కవచానివి 

ముసుగేసుకున్న సమాజం ...

వంశీ కలుగోట్ల// ముసుగేసుకున్న సమాజం ...// ****************************** *********************** నిస్వార్థపరత్వం గురించి పాఠాలు చెబుతూ  నిలువెల్లా స్వార్థం నింపుకున్న గురువిందలు  మహనీయులుగా గుర్తింపబడుతున్న సమాజంలో  మంచితనం అంటే తన ఎదుగుదలకి  ఒక మెట్టుగా ఉపయోగపడే అవకాశంగా  మలచుకోవడంలో నాయకుడు ముందుంటాడు మతం, ధర్మం పేర బోధనలు చేస్తూ  నమ్మకాన్ని వాడుకుంటున్న అవకాశవాదులు  మహాత్ములుగా గుర్తింపబడుతున్న సమాజంలో  మతం పట్ల, ధర్మం పట్ల నమ్మకాన్ని  అమ్మకపు వస్తువుగా మార్చుకోవటానికి  సర్వసంగపరిత్యాగులు కూడా వ్యాపారులవుతారు  శవమైనా, శీలమైనా కులం తెలిసినతరువాతనే  న్యాయం కోరతామనే మేధావులున్న సమాజంలో  ఆడది అంగడిబొమ్మ సరుకులానే ఉంటుంది  కేళిలో కులాలు పైకీ కిందకీ మారుతూనే ఉంటాయి  మెధావిత్వపు మూర్ఖత్వాన్ని వాడుకోవడానికి  రాజకీయాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి 

హీరోస్ ఆర్ ఫాలింగ్ డౌన్ ...

వంశీ కలుగోట్ల// హీరోస్ ఆర్ ఫాలింగ్ డౌన్ ... // ************************************ ***************** మాలో ఒకడినవుతానన్నాడు  కన్నీటిబొట్టును అడ్డుకునే ఓదార్పునవుతానన్నాడు  అవకాశం ఇస్తే అండగా ఉంటానన్నాడు  మాకోసం నిలబడే మనిషవుతానన్నాడు  నమ్మామని అనుకున్నాం కానీ  నమ్మకాని అమ్మకపు వస్తువుగా మార్చుకునే  జిత్తులకు చిత్తయ్యామని తెలియలేదు  పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చినప్పుడే  తిలోదకాలు వదిలేసుకోవాల్సింది  భుజాలమీద మోస్తున్నానని చెప్పే కాగితం పులి  పెద్దకొడుకులా నేనున్నానంటూ ఆశ కల్పించాడు  తన జుట్టు పక్కోడి చేతిలో ఉందని తెలిశాక  కాళ్ళు పట్టుకోవడమే దిక్కని అర్థమయ్యాక  పైవాడిని పక్కోడిని వదిలేసి  ఎదుటోడి మీద పడి ఏడుస్తున్నాడు  ఇజాల పేరున కోకిల ముసుగేసుకుని  గోడ మీదకెక్కి కూసే కాకి ఉంది ఒకటి  కళ్ళకు ఏ పచ్చ అద్దాలు ఉన్నాయో కానీ  దోపిడీలేవీ కంటికి కనబడుతున్నట్టు లేదు  ఇవ్వాళ జరిగిన దోపిడీకి కూడా బాధ్యత  గత కాలపు మోతుబరీ అంటూ కూస్తుంది  గుంటనక్కకు అవసరమైనప్పుడే  కూత కూయడానికి గోడెక్కుతుంది  అండగా నిలబడతామని  జనాలను ముంచేసిన మహానుభావు

... పునాదిరాళ్ళు

వంశీ కలుగోట్ల// ... పునాదిరాళ్ళు // *************************************** గతం మిగిల్చిన గుర్తులు గాయాలు కాదు         ... గమ్యాన్ని చూపే దివిటీలు  గతంలోని జ్ఞాపకాలు వెంటాడే దారుణాలే కాదు         ... నిన్ను నిలిపే పునాదులు  గతమంటే నీలి నీడ కాదు         ... నిప్పులాంటి నిజం  గతం నిన్ను ఆప్యాయంగా పలకరించదు  అనుభూతులన్నిటినీ నిద్దురలేపి  అప్యాతయతలను ఒక్కటిగా పేర్చి  మనసును విషాదంలోకి నెడుతుంది  గుండెను పిండి కవిత్వం రాయిస్తుంది  కంటిచివర కన్నీటిని నిలుపుతుంది  పెదవులపై దరహాసాలు విరబూయిస్తుంది  వర్తమానానికి ఊపిరిపోసి నడిపిస్తుంది  భావి జీవితానికి పునాది వేస్తుంది

భవిష్యత్తును కాపాడుకో ...

వంశీ కలుగోట్ల// భవిష్యత్తును కాపాడుకో ... // ****************************** ******************** నీకు గుర్తుందా  ఎన్ని కష్టాలెదురైనా చెమటను చిందించి శ్రమ పెట్టుబడిగా ఇదే పొలాన్ని నీ ముత్తాత నీ తాత నీ తండ్రి పంటలేసి పండించారు వాళ్ళు పోయారు కానీ నీకు పొలం ఉంది ఇప్పుడు ఈ పొలం పొతే వచ్చే డబ్బు ఎన్నాళ్ళుంటుందో నువ్వైనా చెప్పగలవా వాడో వీడో ఎవడైతేనేం పంటపోలాలని పాడు చేసేవాడు పొలాల్ని పరిశ్రమ చేస్తాననేవాడు నీ పొలానికి రాజులా బతికిన నిన్ను పరిశ్రమలో బంట్రోతును చేస్తాననేవాడు తలతీసి మొలేస్తానని బుద్ధి చెప్పక నెత్తినెక్కించుకుని ఊరేగుతావా  వాడేమన్నా నీ నెత్తిన కాలు పెట్టిన త్రివిక్రముడనుకున్నావా మొక్కటానికి అసలు నీకు అర్థం అవుతోందా వాడు నిన్నూ, నీ ప్రస్తుతాన్నే కాదు భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాడు తరువాతి తరాలకి భవిష్యత్తు అగమ్యగొచరమయ్యెలా చేస్తున్నాడు మత్తు వదిలించుకుని నిజం తెలుసుకో తరువాతి తరాలకోసం భవిష్యత్తుని కాపాడుకో నీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడమంటే మేడలు, మిద్దెలు, డబ్బును ఇవ్వటం కాదు వారికి తిండిని, నీటిని మిగిల్చిపోవటం ... 

రెండో ముఖం ...

వంశీ కలుగోట్ల// రెండో ముఖం ... // ****************************** ** రా ... వెతుక్కుందాం నీలో మహానదిని నాలో పచ్చదనాన్ని 1 ఎండిపోయిన గుండెలతో నీరు ఇంకిపోయిన కళ్ళతో బీటలు వారిన పొలాలతో రాజకీయపు చదరంగంలో తమ బతుకుల గతేమిటో తెలిసీ తెలియని అయోమయంలో అక్కడ కొన్ని జీవితాలు 2 గిరులన్నీ తవ్వకాలకు ఆక్రమించబడితే ఉండటానికి గుడిసెలు లేక ఏమి చెయ్యాలో తెలియక గిరుల ఎత్తుని మించిన స్వార్థపు చిత్తులకు బలైపోయిన బతుకులతో అక్కడ కొన్ని జీవితాలు 3 ఇజపు ముసుగు మాటున రాతల చమక్కుల వెనుక ఏముందో ఎవరికి ఎరుక వెతుక్కుంటూ పొతే ఏదో ఒకనాడు దొరక్కపోవు ఆ నదులు, పచ్చదనాలు నా రాతల్లో నేను, నీ తీతల్లో నీవు మనల్ని మించినవారెవరు *                 *                *   అక్కడి జీవితాలన్నీ కాలుతుంటే ఆ మంటల వెలుగులో వెతుక్కుందాం రా నీలో మహానదిని నాలో పచ్చదనాన్ని

... అలవాటే కదా

వంశీ కలుగోట్ల// ... అలవాటే కదా//  ********************************** అరచేతిలో అధ్బుత స్వర్గం చూపిస్తా అనే వాడిని నమ్మి అందలమెక్కిస్తావు పొలం ఆవల అందమైన ప్రపంచం ఉంది అంటే నమ్మి నీ భూమిని అప్పగిస్తావు వ్యవసాయం దండగ అని ఎవడో ప్రవచిస్తే నమ్మి బతుకును పట్నం బజారులో పడేసుకుంటావు నీ కష్టాలను కడతేర్చటానికి వేరింకెవరికోసమో చూస్తావు నమ్మి నట్టేట మునగటం నీకు అలవాటే కదా

దిక్పాలకులు ...

వంశీ కలుగోట్ల// దిక్పాలకులు ... // ********************************** తూరుపు దిక్కున - ఉన్నారు కొందరు అక్కడ ప్రపంచం బాధని తమ బాధలా ఫీలయ్యే శ్రీ శ్రీ లాంటివారు అక్షరాలు, ఆయుధాలు ఊతంగా తీసుకుని తిమిరంపై సమరం చేసి ప్రపంచానికి వెలుగును పంచాలనుకునే సూరీడు లాంటోల్లు  పశ్చిమ దిక్కున - అక్కడ కొందరు ఉన్నారు ఆశలను అవసరాల మేరకు అణచేసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ, వోట్లు వేసుకుంటూ ఎవడొస్తే వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ బతుక్కూ చావుకూ మధ్య దూరాన్ని ప్రజాస్వామ్యపు స్వేచ్ఛతో కొలుస్తూ చీకటివైపు లోకాన్ని తీసుకెళుతూ ఉత్తరం దిక్కున - అక్కడ కొందరు ఉన్నారు జీవితాన్ని, జీవించడాన్ని అనుభవిస్తూ ఆనందాలని డబ్బుతో కొలుచుకుంటూ ఉన్న సంపదని ఇంతలు ఇంతలుగా పెంచుకుంటూ ప్రపంచాన్ని కిందకు తోసి తాము పైపైకి ఎదిగిపోతూ   దక్షిణ దిక్కున - అక్కడా కొందరు ఉన్నారు   ప్రపంచానికీ తమకూ సంబంధమేంటో అర్థం కాని పరిస్థితుల్లో తమను తామే హత్యించుకుంటూ చరిత్రలో చెత్తని నింపుతూ మార్చటానికి ఎవడో ఒకడొస్తాడని ఎదురుచూస్తూ