... పునాదిరాళ్ళు
వంశీ కలుగోట్ల// ... పునాదిరాళ్ళు //
***************************************
గతం మిగిల్చిన గుర్తులు గాయాలు కాదు
... గమ్యాన్ని చూపే దివిటీలు
గతంలోని జ్ఞాపకాలు వెంటాడే దారుణాలే కాదు
... నిన్ను నిలిపే పునాదులు
గతమంటే నీలి నీడ కాదు
... నిప్పులాంటి నిజం
గతం నిన్ను ఆప్యాయంగా పలకరించదు
అనుభూతులన్నిటినీ నిద్దురలేపి
అప్యాతయతలను ఒక్కటిగా పేర్చి
మనసును విషాదంలోకి నెడుతుంది
గుండెను పిండి కవిత్వం రాయిస్తుంది
కంటిచివర కన్నీటిని నిలుపుతుంది
పెదవులపై దరహాసాలు విరబూయిస్తుంది
వర్తమానానికి ఊపిరిపోసి నడిపిస్తుంది
భావి జీవితానికి పునాది వేస్తుంది
Comments
Post a Comment