భవిష్యత్తును కాపాడుకో ...
వంశీ కలుగోట్ల// భవిష్యత్తును కాపాడుకో ... //
**************************************************
నీకు గుర్తుందా
ఎన్ని కష్టాలెదురైనా
చెమటను చిందించి
శ్రమ పెట్టుబడిగా
ఇదే పొలాన్ని
నీ ముత్తాత
నీ తాత
నీ తండ్రి
పంటలేసి పండించారు
వాళ్ళు పోయారు కానీ నీకు పొలం ఉంది
ఇప్పుడు ఈ పొలం పొతే వచ్చే డబ్బు
ఎన్నాళ్ళుంటుందో నువ్వైనా చెప్పగలవా
******************************
నీకు గుర్తుందా
ఎన్ని కష్టాలెదురైనా
చెమటను చిందించి
శ్రమ పెట్టుబడిగా
ఇదే పొలాన్ని
నీ ముత్తాత
నీ తాత
నీ తండ్రి
పంటలేసి పండించారు
వాళ్ళు పోయారు కానీ నీకు పొలం ఉంది
ఇప్పుడు ఈ పొలం పొతే వచ్చే డబ్బు
ఎన్నాళ్ళుంటుందో నువ్వైనా చెప్పగలవా
వాడో వీడో ఎవడైతేనేం
పంటపోలాలని పాడు చేసేవాడు
పొలాల్ని పరిశ్రమ చేస్తాననేవాడు
నీ పొలానికి రాజులా బతికిన నిన్ను
పరిశ్రమలో బంట్రోతును చేస్తాననేవాడు
పంటపోలాలని పాడు చేసేవాడు
పొలాల్ని పరిశ్రమ చేస్తాననేవాడు
నీ పొలానికి రాజులా బతికిన నిన్ను
పరిశ్రమలో బంట్రోతును చేస్తాననేవాడు
తలతీసి మొలేస్తానని బుద్ధి చెప్పక
నెత్తినెక్కించుకుని ఊరేగుతావా
నెత్తినెక్కించుకుని ఊరేగుతావా
వాడేమన్నా నీ నెత్తిన కాలు పెట్టిన
త్రివిక్రముడనుకున్నావా మొక్కటానికి
అసలు నీకు అర్థం అవుతోందా
వాడు నిన్నూ, నీ ప్రస్తుతాన్నే కాదు
భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాడు
తరువాతి తరాలకి భవిష్యత్తు
అగమ్యగొచరమయ్యెలా చేస్తున్నాడు
మత్తు వదిలించుకుని నిజం తెలుసుకో
తరువాతి తరాలకోసం భవిష్యత్తుని కాపాడుకో
నీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడమంటే
మేడలు, మిద్దెలు, డబ్బును ఇవ్వటం కాదు
వారికి తిండిని, నీటిని మిగిల్చిపోవటం ...
తరువాతి తరాలకోసం భవిష్యత్తుని కాపాడుకో
నీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడమంటే
మేడలు, మిద్దెలు, డబ్బును ఇవ్వటం కాదు
వారికి తిండిని, నీటిని మిగిల్చిపోవటం ...
Comments
Post a Comment