Posts

Showing posts from October, 2015

తీరం నుంచి ఎడారి దాకా...

వంశీ కలుగోట్ల// తీరం నుంచి ఎడారి దాకా...// ******************************************** వాడెవడో వచ్చి నాలా నేను నటించటానికి డబ్బులిస్తానంటున్నాడు అయిదేళ్ళకోసారి ఓటేస్తే చాలంటున్నాడు *            *            * తీరంలో పాదముద్రలు ఇంకా ఉంటాయా అక్కడక్కడా మిగిలున్న మానవత్వపు జాడలా *            *            * తీరం నుంచి ఎడారి దాకా సాగిన పయనంలో ఎన్ని పాదముద్రలు కోల్పోయానో *            *            * కాలం ఎప్పటికప్పుడు తుడిపేస్తూనే ఉన్నా గాయాలు మాత్రం గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి *            *            * ఎవరూ లేని తీరంలో అయలాన్ లాంటి అలేదైనా వస్తుందేమోనని ఒంటరి దీపపు స్థంభంలా ఎదురు చూస్తూ నుంచున్నా *            *            * తీరం అయినా ఎడారి అయినా ఇసుకే కదా నీ మతమైనా నా మతమైనా మానవత్వమే కదా

అసంపూర్ణ కవిత ...

వంశీ కలుగోట్ల// అసంపూర్ణ కవిత  ...// ****************************** ****** ఎదురుగా కంప్యూటర్ తెరపై కదులుతున్న అక్షరాలు కుర్చీలోంచి కదలకుండా పనిచేస్తూ కూపస్థమండూకంలా తయారైన నన్ను చూసి నవ్వుతున్నాయి కరిగిపోతున్న ఖరీదైన కాలాన్ని ఖాళీ కేపుచినో కప్పులతో లెక్కబెట్టుకుంటున్న నన్ను చూసి సాయంకాలం ఇంటికెళ్ళాల్సిందేనంటూ ఆపిల్ గడియారం అలారం కొట్టింది పగటికి రాత్రికి తేడా తెలియని పనిలో కోల్పోయిన కుటుంబ క్షణాలను విదేశీ అవకాశం పూడుస్తుందనే ఆశతో సూర్యుడిని చూడటం మర్చిపోయిన ఆధునికుడిగా నన్ను చూసి నక్షత్రాలు అమావాస్యని కప్పుకున్నాయి అంతరంగంలో ఉప్పెనలా ఎగిసే అంతులేని భావ సంచలనాలకి అక్షరాలు దొరక్క ఆగిపోయిన అసంపూర్ణ కవితలా జీవితం కోసం వెతుకుతూ గమ్యం తెలియని పయనం చేస్తూన్న నేనూ అసంపూర్ణుడినే

మహాత్ములు మారిపోతున్నారు

వంశీ కలుగోట్ల // ... మహాత్ములు మారిపోతున్నారు // ****************************** ****************** మనుషులు పుడుతుంటారు, పోతుంటారు మహాత్ములు మాత్రమే ఎప్పుడో ఒకసారి పుట్టి గతిని మార్చి గుర్తును మిగులుస్తుంటారు ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికలకూ  ఒక్కొక్క మహాత్ముడు పుట్టుకోస్తున్నాడు ప్రచార సభలో జనసందోహాన్ని చూసి ఒళ్ళు మరచిన 'అయిదేళ్ళ' మహాత్ములకు మాటలకు చేతలకు తేడా తెలియని మైకం కమ్మిన ఊపులో చేసే వాగ్దానాల ప్రవాహ ప్రభంజనం ఓటేయ్యడానికి మాత్రమే పుట్టిన జనాలను ముంచేస్తోంది కుర్చీనెక్కిన మహాత్ములకు  జేజేలు కొట్టే జనానికి, లెక్కలు చెప్పే అధికారులకు తేడా తెలిసి మౌనం ఆవహించి ముని అయిపోతారు గతం అంటే క్రితం ప్రభుత్వం మాత్రమే గుర్తొస్తుంది తప్ప చేసిన వాగ్దానాలు కాదు దేశం ఆవల  పరాయి గడ్డపై తన్నుకొచ్చే మాటకారితనం ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఎగదన్నుకొచ్చే ఆవేశం ఎన్నికలైపోయిన రాష్ట్రానికి వెళితే ముసుగుతన్ని గమ్మున మూలనపడుంటాయి మతిమరుపు ముంచుకొచ్చి మాజీ ప్రభుత్వాలు మాత్రమే గుర్తుకువస్తాయి మాజీలు చేసిన మోసాలకు ఒళ్ళు మండి కొత్త మహాత్ముడి

... పోరాటం

వంశీ కలుగోట్ల // ... పోరాటం // *************************** కిరణాలు ఆగిపోతే  దీపాలు వెలిగించే మనం యోధుడు పడిపోతే  యుద్ధం ఆపేస్తాం పోరాడే యోధులు కూడా  మామూలు మనుషులే మరణానికి అతీతులు కారు  గళమెత్తి పోరాడితే  గొంతు కోసే సమాజం ఇదని ముందుండి నడిపిద్దామని అనుకుంటే వెనకున్నజనం వెన్నుచూపుతారని నిజాలు తెలియని జీవితాలు  స్మృతి స్థూపాల మీద  పేర్లుగా చెక్కబడతాయి  ఒక యోధుడో/నాయకుడో  నిష్క్రమించినపుడు  కావాల్సింది కొవ్వొత్తులతో సంతాపాలు పోరాటానికి  విరామాలు కాదు  పోరాటం అంటే  నాయకుడు ముందుండి చేసేది కాదు  సేనలు గెలిపించేది

అంతరంగం ...

వంశీ కలుగోట్ల// అంతరంగం ...// ****************************** ** ఎందుకలా బాధపడతావు నీవంటే ప్రేమ లేక కాదు నీ మీద గౌరవం తగ్గలేదు అక్షరం పట్టుకుని పోరాడుతున్న మిత్రులను ఆయుధంతో చంపేస్తున్నాడు శత్రువు పంచన చేరి మోచేతికింది నీళ్ళు తాగుతూ మోస్తున్న తుచ్చులను చూసుకుని అక్షరాన్ని లెక్క చేయటం లేదు మదమెక్కిన అధికారం తోలు మందమెక్కిన అధికారానికి నిరసన ఎలా తెలిపేది?   అడుగుకో ఆశని చంపుకుంటూ అవతారుడికోసం ఎదురుచూస్తూన్న మామూలు జనాలకోసం వెలుగును చీల్చి కిరణాలుగా పంచే ప్రయత్నంలో అక్షరం అండగా  పోరు సల్పుతున్న ధీరులను  అది కల్బుర్గినో లేక ఇంకో తస్లీమానో వెంటపడి తరుముతుంటే ప్రాణాలు తీస్తుంటే ఏమి చెయ్యాలి? నా రాతలతో  వెలుగు పంచానని పంచగలనని తిమిరంతో సమరం చెయ్యగల అక్షరాన్ని నమ్ముకున్నవాడినని చెప్పి నిన్ను నా దరికి చేర్చారు బహుమతి అంటే ఏమన్నా బంధనమా బానిస బతుకు కాదు నీదైనా నాదైనా నీకు నాకూ ఇద్దరికీ మకిలి అంటిస్తున్న రాజకీయానికి నిరసనగా నీతో బంధాన్ని తెంచుకుంటున్నానే కానీ నీ మీద గౌరవం తగ్గి కాదు

బహుమతి అంతరంగం ...

వంశీ కలుగోట్ల// బహుమతి అంతరంగం ... // ******************************************** ఇన్నాళ్ళూ సహవాసం చేసి ఇప్పుడు ఎవరో, ఎక్కడో ఏదో చేశారని నన్ను వదిలేస్తానంటావా మధ్యలో నేనేం చేసానని? ఎక్కడో ఎవరినో ఎవరో ఏదో చేస్తే ఎవరో ఇంకెవరినో చంపేస్తే దానికి నాదెలా అవుతుంది బాధ్యత నీ ఇంటికి నేనొచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నావు నీ సహజ ప్రతిభకు శోభనిచ్చానని మురిసిపోయావే గుర్తింపు వచ్చిందని గర్వపడ్డావే ఇప్పుడు నేనేమైనా మకిలి అంటించానా లేక మసి పూశానా నా మీదేందుకు నీ పేద కోపం? అక్షరం నీ అయుధమన్నావే వాడటం మరచిపోయావా ముసుగేసి మూలాన కూచోబెట్టావా లేక నీ మెదడుకు వృద్ధాప్యం వచ్చిందా ఉరిమి ఉరిమి నా మీద పడుతున్నావ్ నాకే  ఇజమూ లేదనుకున్నావా నాకే హక్కులూ లేవా చిత్తానికి వాడుకుని వదిలెయ్యటానికి మనదేమైనా చీకటి భాగోతమనుకున్నావా నీ విద్వత్తును మెచ్చి ఇవ్వబడ్డ బహుమతిని నేను

మనుషులు కావాలి ...

వంశీ కలుగోట్ల // మనుషులు కావాలి ...// ***************************************** ఈ ప్రపంచాన్ని నడిపించేందుకు మనుషులు కావాలి ... పరుగులు తీస్తున్న ప్రపంచానికి యంత్రాలమయమైపొయిన జీవితాలకి అలుపు తీర్చే వ్యాపకం కావాలి గోడమీదకెక్కి గంతులేసే మనిషి మనసుకు కళ్ళాలు వేసి కళ్ళు తెరిపించే జ్ఞానం రావాలి ... దేవుడికోసం ఎదురుచూసే మతం గురించి కొట్టుకునే దుర్బలుల మధ్య ... ఇనుప కండలు, ఉక్కు నరాల యోధాగ్రేసరులు ఉద్భవించాలి తూర్పు తిరిగి దణ్ణం పెట్టే  తుప్పు పట్టిన మెదళ్ళను మొదలు నుంచి ప్రక్షాళన కావించే విప్లవం రావాలి మానవత్వం మిగిలున్న సాధించే సహనమున్న పోరాడే గుణమున్న మనుషులు కావాలి

వీళ్ళింతే ...

వీళ్ళింతే ...   *********** 1 తనవాదమేదో తనకే అర్థం కాక   అటువైపో ఇటువైపో  దూకటానికి సిద్ధంగా  ఉన్న గోడమీద పిల్లి లాంటి పెద్దమనిషి   బాటమీద వెళుతున్న  నన్ను ఏ వాదమంటూ ప్రశ్నించాడు 2 నా ఇంటికి గోడకు వేలాడుతున్న  పులి బొమ్మను చూపి  నా వంశం అంతా హింసావాదమేనన్నాడు  కళ్ళున్న కబోది మూర్ఖుడు ఒకడు 3 ఓటు మాత్రమే వేస్తూ ఉన్నన్నాళ్ళు నన్నెవరూ పట్టించుకోలేదు నేనెవరో అడగలేదు ఇపుడు నేను ప్రశ్నించటం మొదలెడితే నాదే ప్రాంతమో నేనే మతమో నాదే వాదమో నా చొక్కా రంగేమిటో నేనే పార్టీ జెండా మోసానో కూపీలు లాగుతున్నారు

దేవుడు కావాలి

వంశీ కలుగోట్ల// దేవుడు కావాలి // ******************************** నేను నీతిగా, నిజాయితీగా ఎలా ఉండగలను అవసరాన్ని బట్టి అలా మారుతుంటాను నేను కేవలం మానవ మాత్రుడిని కదా  కానీ అలా మారని వాడు ఒకడు కావాలి సామాజిక బాధ్యతలతో నాకు సంబంధం లేదు సామాజిక హక్కులు మాత్రం సాధించుకోవాలి కానీ ఆ బాధ్యతలు నేరవేర్చేవాడొకడు కావాలి  నేను చెయ్యలేనివి చెయ్యటానికి; మహాత్ముడి లక్షణాలతో, మామూలు మనిషిలా కాకుండా సమాజం కోసం, ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసి పోరాడగలిగే మనిషి ఒకడు కావాలి  కావాలంటే వాడికి దండేసి దణ్ణం పెడతాం వీధులకు పేరు పెడతాం, దేవుణ్ణి చేసి పూజిస్తాం ఇదంతా భావుకత్వమో, బలిసిన తత్వమో కాదు దేవుడు కాలేని మనిషి మనసు ఘోష మాత్రమే

... సమావేశం

వంశీ కలుగోట్ల  // ... సమావేశం// ********************************* చేసిన కొంత చెయ్యాల్సిన కొండంత చేస్తున్న పిసరంత ఈ సమావేశం దేనిగురించో ఎవడిది తప్పు ఎవడిది ఒప్పు ఎవడికేం కావాలి ఏమీ తెలీని అంధ సమూహం వెలుతురు ఉందని తెలిసినా కళ్ళు తెరవని మేధావిత్వం ఏమి సాధించామో తెలీదు కాని ... చేసిందేదీ పనికిరాదని చెయ్యాల్సింది ఇంకేదో ఉందని సమావేశం తేల్చింది మళ్ళీ మొహానికి ముసుగు మార్చుకుని  ఇంకో సమావేశానికి తయారు కావాలి ...

నా మతం

నా మతం *********** ఎవడికి సమ్మతమో ఎవడికి అసమ్మతమో నాకు అనవసరం నేనింతే, నా తీరింతే దేవుడు నేనే భక్తుడు నేనే ఎవడి చేరికలు ఉండవు ఎవడి పోకడలు ఉండవు మారణహోమాలు ఉండవు తీరు నచ్చితే నువ్వూ నీ మతం మొదలెట్టు ఏ గొడవా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది

దేవుడా...

దేవుడా... ********** నువ్వే దిక్కు అన్నందుకు ఇదా నువ్వు చూపించే ఫలితం నువ్వు తప్ప ఇంకెవరూ ఏమీ చెయ్యలేని, మార్చలేని తీరుకి పరిస్థితుల్ని తీసుకురావడమేనా నువ్వు చూపిన దిక్కు ఇంకెప్పుడూ, ఎక్కడా, ఎవరికీ మళ్ళీ చెప్పకు, అనకు మళ్ళీ మళ్ళీ జన్మించి అక్రమాల్ని అణచివేస్తానని ఎదురుచూడటం అలవాటైపోయింది జనాలకు తోలు మందమైపోయింది అక్రమార్కులకు

జాగ్రత్త

జాగ్రత్త ******** దారి వెంట వెళుతుంటే ఒక కుక్క మొరిగింది బహుశా అది దాని పలకరింపేమో తెలీదు నేను మాత్రం అది ఎక్కడ కరవడానికోస్తుందో అని చిన్న కర్ర తీసుకుని సిద్ధంగా ఉన్నాను సాయంకాలమైంది ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు దీపం, అగ్గిపెట్టె దగ్గర పెట్టుకుని సిద్ధంగా ఉన్నాను వానొస్తే గొడుగు, చలేస్తే రగ్గు, ఎండకు ఫ్యాన్ ఇలా ప్రతి కాలానికి, ప్రకృతి ప్రకోపాలను తట్టుకోవడానికి సిద్దగా ఉంటాను కానీ దీనమ్మా జీవితం, అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు మాత్రం జాగర్తగా ఉండలేకపోతున్నాను

పాఠాలు ...

వంశీ కలుగోట్ల // పాఠాలు ...// ************************** అనగనగా ఓ రోజు చిన్ననాటి మిత్రుడొచ్చాడు మేడ మీద కూర్చున్నాం చిన్ననాటి స్మృతులు నెమరేసుకున్నాం అది అమావాస్యనుకుంటాను వెన్నెల కాంతులు లేవు కొవ్వొత్తి వెలిగించి కూర్చున్నాం పేకాట అయిపొయింది మా ఇంట్లో గొడవలు వాళ్ళింట్లో సమస్యలు అయిపోయాయి ఆది మానవుడి నుండి ఆధునిక కవిత్వం దాకా పాకిస్తాన్ నుండి పక్కింటి గొడవ దాకా సవివరంగా సహేతుకంగా తెలివితేటలు ప్రదర్శిస్తూ మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం ... అలసిపోయాం అప్పుడు చూసాను కొవ్వొత్తి వంక చివరి కాంతులు వెదజల్లుతూ ఓ సారి నా వేపు చూసి చీకట్లలో కలిసిపోతూ ఫక్కున నవ్వింది చెంప చెళ్ళుమనిపించినట్టనిపించింది

కదనం ...

వంశీ కలుగోట్ల // కదనం ... // ****************************** నాలోనే ఉన్నప్పుడు నాతోనే ఉన్నప్పుడు తన అస్తిత్వం తనతోనే ఉంచుకున్నపుడు నిప్పు తునకలా సంధించిన బాణంలా ఉదయించిన కిరణంలా పదును పెట్టిన ఆయుధంలా చురుకుగా ఉండేది నాలో ఉండిన అలాంటి ఒక అక్షరానికి ఊపిరి పోసి ప్రజల పక్షం నిలబడి ప్రశ్నించమని పంపితే ప్రపంచంలో చేరి బతకనేర్చింది బహుముఖత్వం అలవాటు చేసుకుంది ఎప్పుడెవడి పక్కలోకి దూరితే వాడి తిక్కనంతా తన తలకెత్తుకుని ఏ జెండా కింద నిలబడితే ఆ రంగు పులుముకుని రాజకీయం నేర్చింది ముసుగేసుకుని పూటకో మాట మారుస్తూ కుర్చీనెక్కిన ప్రతివాడికి బాకా ఊదుతూ తందాన గుంపులో తప్పెట మోతలా మిగిలిపోయి ఆశయాలు మరిచిపోయి అస్తిత్వం కోల్పోయి అలా ముందుకు పోతోంది క్షరము లేదని విర్రవీగి నివురుగప్పిన అక్షరానికి పట్టిన పిచ్చిని పూసుకున్న రంగులను అంటిన రాజకీయాన్ని వదిలించి నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రశ్నించే పాత నైజాన్ని పునః ప్రతిష్ట చెయ్యటానికి సాగుతున్న కదనంలో అడుగు కలిపి కదులుతున్నా

సంతాపం ...

వంశీ కలుగోట్ల// సంతాపం ...// ****************************** పంట పండించి అందినంతకి అమ్ముకుని అప్పోసప్పో చేస్తూ భారంగా బ్రతికినన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు కష్టాలు తట్టుకోలేక ధైర్యం చచ్చిపోయి పురుగులు చావని మందుకు మనుషులెలా చస్తారో అర్థం కాక అదేమందు తాగితే ఇవాళ  రైతు చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు బతికించాల్సిన పంటని పండించే భూమిని కాపాడాల్సిన జీవితాల్ని పట్టించుకోని వాళ్ళు శవానికి వెల కడుతున్నారు కిరాణా కొట్టులో పాతికకు కొన్న సరుకును సూపర్ మార్కెట్ లో వందకి కొనేవాడికి వంద కాకపొతే వెయ్యిచ్చి ఓటు కొనేవాడికి గోడు వినే ఓపిక తీరికా లేవు శవానికి సంతాపాలు తెలపడం తప్ప అయినా వృధా ప్రయాస కాకపొతే కంప్యూటర్ హృదయమున్న పాలకులకు ఉరేసుకుంటున్న రైతుల జీవితాలు తరుగుతున్న పొలాల విలువ తెలుస్తుందా

దేవుడేం చెయ్యగలడులే

వంశీ కలుగోట్ల// దేవుడేం చెయ్యగలడులే// ****************************** *********** అయినా దేవుడేం చెయ్యగలడులే దూతనని చెప్పుకునేవాడు సుఖాలు అనుభవిస్తూ దందాలు నడుపుతూ ఐశ్వర్యాలు దండుకుంటుంటే భక్తుడిననేవాడు కానుకలిచ్చి తప్పులన్నీ చేసేసి చేతులెత్తి దండాలు పెడుతుంటే తలరాతలు రాసి ఖర్మానికి వదిలేసిన మానవజాతి తాడిచెట్టులాగా ఎదిగి తన్నుకు చావటం చూసి ఇంకోడెవడో వచ్చి తనదో కొత్త మతమని తానే  దేవుడినని చెప్పుకుని విగ్రహం పెట్టుకున్నా  దేవుడేం చెయ్యగలడు  అన్నిటినీ చూస్తూ ప్రార్థనాలయాల్లో బందీ అయి 'వినాశకాలే విపరీతబుద్ది' అని సరిపెట్టుకుని సర్దుకుపోక దేవుడేం చెయ్యగలడు

నువ్వు - నేను

వంశీ కలుగోట్ల// నువ్వు - నేను // ****************************** నాణేనికి రెండోవైపుందని మరిచిపోయావా మిత్రమా ... నేనేవాదినో ఎవరి వాడినో ముద్ర వేసే ముందు నను విన్నావా నా సమ్మతమడిగావా గాయాలు చూపి నాది కాని గతమేదో చెప్పి నన్నొక గాటన కట్టేసావు కూలిన గోడలు చూపి నేను లేనప్పుడు నాది కాని భవనమెలా ఉండేదో చెబుతున్నావు గాయాలు నీవి కావు భవనం నాది కాదు నీ కోసం పోరు సలిపింది అండ నిలిచింది బాట వేసింది బరువు మోసింది ఒకనాటి నేనే కదా అక్షరం పట్టుకుని నేనిక్కడ పోరాడుతుంటే ఎందుకిలా చరిత్ర లోంచి చెత్తను పీకి నాకంటిస్తున్నావు నువ్వు చెబుతున్న ఆ గతంలోని నా భవనాలు పోయాయి నీ పాత గాయాలు మానాయి కొత్త గాయంతో నేను గాయం మిగిల్చిన మచ్చతో నువ్వు ఇద్దరమూ ఒక్కటే ఒకే నాణేనికి రెండు ముఖాలం

సరికొత్తగా పుట్టుకురా ...

వంశీ కలుగోట్ల //  సరికొత్తగా పుట్టుకురా ...// ****************************** ********* కొత్త కోసం కోత మొదలవుతోంది నీలోంచి పాతని పాతరెయ్ పట్టిన బూజును, అంటిన దుమ్మును వేసిన ముసుగును వదిలేయ్ బహిరంగ ఆధునికుడా, నీ లోలోని జాడ్యాలను మూలానికంతా ఊడబీకేయ్ కుబుసం విడిచి కొత్త పుట్టుక పుట్టే నాగులా నీలోంచి నువ్వు మళ్ళీ సరికొత్తగా పుట్టుకురా

కొత్త వర్ణాల కోసం ...

వంశీ కలుగోట్ల// కొత్త వర్ణాల కోసం ...// ****************************** ******* ఓ మా'నవుడి' బొమ్మ గీద్దామని వర్ణాల కోసం అన్వేషణ మొదలు పెట్టాను కొనసాగుతున్న యుద్ధం లోంచి పుట్టుకొచ్చిన రక్తపు వాసనల ఎరుపు రంగు పుడమి పరచిన అడవి తివాచీలోని చెట్ల ఊపిరి తీసి పిండుకొచ్చిన పచ్చరంగు జరుగుతున్నమారణహోమంలో కాలుతున్న బ్రతుకుల మంటలలోని పసుపు రంగు ఏ రంగుతో బొమ్మ గీద్దామన్నా అవి ఏదో ఒక మంటలో కాలుతూ మసి పులుముకున్నాయి మూలాలకు దూరం జరిగి సంకుచితాలతో సంకరమై పుట్టుకొచ్చిన కొత్త వర్ణాలు వద్దనుకున్నాక చూస్తె ఇక ఏ రంగూ మిగలలేదు మా'నవుడి' బొమ్మ గీయడానికి సరికొత్త వర్ణాల కోసం నా అన్వేషణ ... కొనసాగుతూనే ఉంది

... ఇవాళ విశ్రమిద్దాం

వంశీ కలుగోట్ల // ...  ఇవాళ విశ్రమిద్దాం// *************************************** తొలకరి వాన తడికి పులకించిన పొలంలా నీ తొలిముద్దుతో పరవశించిన నేను చిరుగాలి తాకిడికి పరవశించిన ప్రకృతిలా నా గాఢ పరిష్వంగనంలో ఇమిడిపోయిన నువ్వు  కురుక్షేత్ర యుద్ధానికి రాయబారంతో బీజం వేసిన కృష్ణ పరమాత్మలా వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు  యుద్ధభూమిలో బలాబలాలు తేల్చుకుంటున్న వైరి పక్షాలలా మన సమాగమం  యుద్ధం ముగిశాక అస్త్రాలు పక్కన పెట్టి మిత్ర పక్షాలుగా మారిన రాజ్యాల్లా ... సేదతీరుతున్న మనం నిరంతర సమరం జరిపే సైన్యంలా రేపటి యుద్ధం కోసం వేచి చూస్తూ ఇవాళ విశ్రమిద్దాం ...

... మళ్ళీ నీకోసం

వంశీ కలుగోట్ల // ... మళ్ళీ నీకోసం// ********************************* నువ్వెలాగూ రావని రాలేనని తెలుపటానికి ప్రతిసారీ ఒక 'మనీషి'ని పంపుతున్నావు కానీ, మేము మాత్రం వచ్చిన ప్రతివారికి దండేసి దణ్ణం పెట్టి మహాత్ముడిని చేసి ఎదురు చూస్తూనే ఉన్నాం మళ్ళీ నీకోసం ...

అనుకుంటాం కానీ ...

వంశీ కలుగోట్ల // అనుకుంటాం కానీ ... // ************************************* విజయం సాధించటానికి యుద్ధం చెయ్యాలని అనుకుంటాం కానీ ... ఆ అవసరమే లేదని గోబెల్స్ సృష్టించిన ఆధునిక ప్రపంచం నేర్పింది పోరాటానికి ఆయుధం అవసరం అనుకుంటాం కానీ ... అక్కర్లేదని పిల్లాడు సాధించుకున్న బొమ్మ నాకో నిజాన్ని చెప్పింది  అద్భుతాలు చెయ్యటం దేవుడికే సాధ్యం అనుకుంటాం కానీ ఆర్తుల మొహంపై చిరునవ్వు అనే అద్భుతాన్ని సాధించిన మనీషిని చూసినపుడు నేను కూడా ... అద్భుతాలు సాధించగలనని తెలిసింది

మార్పు ...

మార్పు ... ************ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్న మహాత్ములారా రండి ... గోడమీదకి ఎక్కండి రాతలు రాస్తారో గీతలు గీస్తారో కేకలు పెడతారో అంతా మీ ఇష్టం మార్పును అశిస్తూ కొత్తను కోరుకుంటూ ముఖపుస్తకపు  గోడ మీద రాసే రాతలకు లైకులు కొట్టే వారి లెక్క వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య చూస్తే తెలుస్తుంది కదా మారుతున్న వారి తీరు ఏంటో ఈ ముఖ పుస్తకపు రోజుల్లో మార్పు సాధించడం చాలా సులువైపోతోంది సాంకేతికత సాధించిన ప్రగతికి మురిసిపోతూ మార్పును గోడమీద చూసుకుని పొంగిపోదాం ...

నిరీక్షణ

వంశీ కలుగోట్ల // నిరీక్షణ... // ************************** ప్రతి ఎన్నికలకీ  వేలి మీద ఇంకు గుర్తు చూసుకొని  ఏదో సాధించినట్టు  గర్వంతో పొంగిపోయే సామాన్యుడిలా  కథలూ, కవితలూ  రాసుకునే నేను కూడా అంతే అల్పసంతోషం అన్నది  మాకిద్దరికీ అలవాటైపోయింది ఎవరో ఒకరు వచ్చి  ఏదో ఉద్దరిస్తారని వోటేసేవాడు సామాన్యుడు ఎప్పటికైనా  మారతాడని ఎదురుచూస్తూ నేను  నిరీక్షణ  మాకు అలవాటైపోయింది తరాలుగా

... నేనెంత బాధపడతానో

వంశీ కలుగోట్ల // ... నేనెంత బాధపడతానో // ************************************** ఊరికే అంటావు కానీ దేశం గురించి నాకేమీ పట్టదని నేనెంత బాధపడతానో నువ్వెప్పుడైనా ఆలోచించావా మేమందరం ప్రతి శుక్రవారం సాయంకాలం కలిసి చర్చిస్తాం  మన మాతృదేశం ఏమైపోతోందో ఆ పార్టీ కాకపొతే ఈ పార్టీ వాడి వంశం కాకపొతే వీడి వంశం తరాల దోపిడీ కొనసాగాల్సిందేనా అని  సినిమా టికెట్ కొనడం దగ్గర నుంచి ఇల్లు కొనడం వరకు ఎటు చూసినా ప్రతి స్థాయిలోనూ అవినీతి దేశమా ఏమిటీ దరిద్రం అని గుండె బరువెక్కి ఏడవాలనిపిస్తుంది రెండు పెగ్గులు విష్కీ తాగాక  అప్పుడు నేనెంత బాధపడతానో  దేశం గురించి నేనెంతగా ఆలోచిస్తానో ఎంతగా వెక్కి వెక్కి ఏడుస్తానో నువ్వెప్పుడైనా ఆలోచించావా

మేమింతే

వంశీ కలుగోట్ల // ... మేమింతే // **************************** వందమందిని చంపిన ధీరనాయకుడి కత్తి అంచున రక్తపు చుక్క జారినప్పుడు నిక్కబోడుచుకున్న రోమాలకు నిస్సహాయతతో నిస్తేజితులై కన్నీరు కారుస్తున్న బాధా తప్తుల కళ్ళు తుడవడానికి ఒక మనిషి ముందుకు నడిస్తే చలనం ఉండదెందుకని పరుగెత్తే ఆశ్వపుడెక్కల చప్పుడుకి  బెదిరి అదిరినగుండెలు ఆకలి అరుపులకి బరువెక్కవెందుకని తండ్రి సంపాదనని కథానాయకుడు తాగుడికి, తిరుగుళ్ళకి పోస్తే లాజిక్కులు వెతకని మేధావిత్వం అదే కథానాయకుడు తండ్రి సంపాదనని ఊరి బాగుకోసం ఖర్చు పెట్టే దృశ్యాలను మాత్రం  వెటకారపు నవ్వులతో వెక్కిరిస్తాయెందుకో గ్రాఫిక్కుల మాయాజాలానికి మత్తుతో బైర్లు గమ్మిన కళ్ళకు పాడుబడిన పల్లె సౌందర్యం చూపితే ఏం ఆనుతుందిలే - అది పల్లె కదా మేమింతే త్రివిక్రమ్ చెప్పినట్టు లాజిక్కులు కాదు మాజిక్కులే కావాలి

పునరుత్థానం

పునరుత్థానం ************** ఒక కెరటం ఉవ్వెత్తున ఎగసి కరిగిపోయినట్టుగా ఓ పుణ్యభూమీ ... నీ జ్ఞాపకాల్లో తడిసిన మేమూ అంతే ఐతే ఇది అలసట కాదు అలకు ఆగిపోవటం తెలీదు ఒక్కసారి ... ఉప్పెనై ఎగిసినపుడు తెలుస్తుంది ప్రపంచానికి దాని శక్తేమిటో తెలుపటానికి గడ్డిపోచలే కాదు కొండరాళ్ళూ మిగలవు ...

స్వాప్నికుడు

స్వాప్నికుడు ************* మిత్రమా స్వర్గం ఎక్కడో లేదు ప్రయత్నిస్తే ... శ్రమిస్తే మన కాళ్ళ దగ్గరకొస్తుంది మన తలపై ఉన్నది అనంత శూన్య ఆకాశం మాత్రమే మిత్రమా దేశాలు, సరిహద్దులు లేకపోతె మతాలూ, మారణహోమాలు ఉండకపోతే కులాలు, వర్గాలు సమసిపోతే శాంతి పరిఢవిల్లుతుంటే మీరంతా అంటారేమో నేనొక స్వాప్నికుడినని బాధలు, ఆకలిచావులు ఆస్తుల గొడవలు లేకుండా సోదరభావంతో అందరూ ప్రపంచమంతా ఒక్కటిగా ...ఇది సాధ్యమా మీరంతా అంటారేమో నేనోక స్వాప్నికుడినని కానీ నేనొక్కడిని కాదు నాకు నమ్మకం ఉంది మీరంతా నాతొ కలుస్తారు ఏదో ఒకరోజు ప్రపంచమంతా ఒక్కటిగా జీవిస్తుంది (జాన్ లెన్నన్ 'ఇమాజిన్' కు స్వేచ్చానువాదం)

శివుడయ్యేది ఎప్పుడురా? ...

శివుడయ్యేది ఎప్పుడురా?  ... ****************************** సాగర మధనంలో పుట్టిన హాలాహలం హరించిన హరుడిననుకున్నావా మౌనంగా ఉంటె ముని అంటారనుకున్నావా నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా అయిదేళ్లకోసారి దండాలు పెడుతున్నారని నువ్వు దేవుడి ననుకుంటున్నావురా పంచవర్ష ప్రణాళికలో పావువిరా నువ్వు నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా గతితప్పిన మతం, సృష్టించిన మాయని కార్చిచ్చై కాల్చేసి మసిబార్చేస్తుంటే తిక్కని తలకెత్తుకుని తైతక్కలాడతావా నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా బొక్కసాలు నింపుకునే కొడుకులని అరచేతిలో స్వర్గం చూపే వెన్నుపోటుగాళ్ళని ఎన్నాళ్ళు నీ గూని వీపుపై మోస్తావురా నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా గుడిలో బొమ్మలకి, గూట్లో చిలకలకి కష్టం తీర్చమని వేడుకోలులెందుకురా మౌనం వీడి నువ్వు మార్గం పట్టేదేప్పుడురా నరుడా, నువ్వు శివుడయ్యేది ఎప్పుడురా?

అద్దంలో అందగాళ్ళు

వంశీ కలుగోట్ల// అద్దంలో అందగాళ్ళు // *********************************** ఉదయం నిద్దుర లేచి తాజాగా స్నానించి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను ఎంత అందంగా ఉన్నానో నా కళ్ళల్లో ధైర్యం, నమ్మకం ప్రతిఫలిస్తున్నాయి నేనెంత సాహసినో కదా అనుకున్నాను *       *       * ఆ సాయంకాలం చీకట్లు తరుముకోస్తుంటే ఊరి బయట చెరువు గట్టుకు వీడ్కోలు పలికి వెనుతిరిగాను ఇంతలో ... ఏవో ఆక్రందనలు రక్షించమంటూ అరుపులు ఎవరో మృగాల్లు చేతుల్లో కత్తులతో ఆమెను బెదిరిస్తున్నారు చెట్టు చాటున దాక్కుని వలువలూదదీసుకున్న మానవత్వాన్ని కోరికతో మృగమైన మానవుని దాష్టీకాన్ని కళ్ళారా చూసాను *       *       * మళ్లీ మరుసటి ఉదయం అద్దంలో ... అందంగా నేను ఆ రాత్రి ఆమె అశక్తత నా నిస్సహాయత నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికీ ...  *       *       * నేనేనా ... నా లాగ ఎందరో అద్దంలో అందగాళ్ళు మేరునగధీరులు

ఆలోచనల్లోంచి ...

వంశీ కలుగోట్ల// ఆలోచనల్లోంచి ... // ****************************** ******* 1 కమ్ముకున్న నివురును వదిలిద్దామని నిప్పును పట్టుకుంటే నిజంలా నిలువునా కాల్చేస్తోంది 2 అడవిలోకి విసిరేసిన ప్రశ్నను అధికారం అణచివేస్తోంది 3 ప్రశ్నించడం మర్చిపోయిన గొంతుక ఇప్పుడు  సమాధానాలు వెతుక్కుంటోంది 4 బాధ్యతలు మర్చిపోయిన ప్రజ హక్కుల కోసం పోరాడతానంటోంది 5 కిందున్న నీడ చూసి కోటమీది జెండా రాజ్యమంతా తనదేనని మురిసిపోయినట్టు గెలిచిన పార్టీకి వోటేసిన వాడు ప్రభుత్వం తనదే అనుకుంటున్నాడు ఇక జరిగేదంతా మంచేననుకుంటున్నాడు 6 రోజూ వచ్చే ఉదయం ఏదో ఒక రోజు తన బతుకులో వెలుగు తెస్తుందనే నమ్మకంతో పోలానికెల్తున్నాడు రైతు 7 మన పిచ్చి కాకపొతే కళ్ళముందు పిల్లలు రాలుతుంటే రాని కన్నీరు ఈ పాలకులకు ఉల్లికోతకు వస్తుందా

ఊరికే అలా

ఊరికే అలా *********** తోడు కోసం ఎదురుచూస్తోందని నువ్వు దారి చూపటానికి ఉందని నేను ఆ దీపపు స్థంభం గురించి *          *           * బయట చినుకుకోసం నే తపించిపోతుంటే లోపల పోటెత్తిన వరదలా నీ జ్ఞాపకం ఏమిటో ఈ వైరుధ్యం *          *           * గోడకు తగిలించిన పటంలా నిశ్శబ్దం అలవాటైపోయిన స్మశానంలా నా లోపలి నేను *          *           * సూర్యుడి కంటే ముందు వెలుతురు కోసం చీకట్లను చీల్చుకు నిద్దురలేచే ఒక మనిషి కోసం ఎదురు చూస్తున్నారు *          *           * విప్లవించే మనిషి కోసం వెతుకుతుంటే ఎడారిలో మొలిచిన మొక్కలా నువ్వు దాహార్తిని తీర్చగలవా *          *           * నీకోసమని నేను గ్రామం వదిలి వస్తే నువ్వు దేనికోసమో దేశం వదిలి వెళ్ళావన్నారు నా అడుగులు ఎప్పుడూ ఆలస్యమేనేమో *          *           * విప్లవించితే పోయే ప్రాణం కన్నా ప్రజాస్వామ్యంలో పదవి విలువ ఎక్కువ అని తెలుసుకున్నవాడు నాయకుడయ్యాడు *          *           * ఊరికే అలా రాద్దామని కూర్చుంటే ఉరేసుకున్న రైతు గుర్తొచ్చాడు అక్షరం ఆవేదనైంది *          *           * నా రాతలు చదివే వాళ్ళకంటే నా బొమ్మను చూసేవాళ్ళే ఎ

సరదాకి

వంశీ కలుగోట్ల // సరదాకి  ... // ***************************** మహేష్ బాబు వచ్చి మటాష్ చేస్తాడనుకుంటే సంపూర్నేష్ బాబు వచ్చి చించేసినట్టు *                *             * అట్టర్ ఫ్లాప్ సినిమాకి అభినందన సభలెక్కువ సూపర్ హిట్ సినిమాకి రివ్యూ రాసేటోళ్ళు ఎక్కువ *                *             * సినిమాకి కథుందారా కొత్త దర్సకుడా అంటే గ్రాఫిక్స్ ఉన్నాయి గదరా గార్దభపుత్రా అన్నాడట *                *             * మహారాజు కన్నా మొండోడు బలవంతుడన్నట్టు సినిమా తీసేటోడికన్నా ట్వీట్లేసోటోడికే పాపులారిటీ ఎక్కువ *                *             * బూతు సినేమాకెందుకు పోతావురా బోడిలింగం అంటే నీ సినిమాలో ఏముందో చెప్పురా నాగలింగం అన్నాట్ట *                *             * హీరోయిన్ యెక్కడే పనికిమాలిన దానా అంటే  కాస్తాగురా బేకారోడా మేక్ అప్ ఏస్కోని వస్తా అందట *                *             * రాజకీయాల గొడవ నీకెందుకే రంగనాయకీ అంటే పవన్ కళ్యాణ్ సినేమాకేల్దాం పదరా రంకుమొగుడా అందట *                *             *

మరకలు

మరకలు ******** ఎర్రబారిన కళ్ళు రసాస్వాదన గుర్తు అనుకుంటున్నారు నీ విరహంతో జ్వలిస్తోన్న హృదయానికి సంకేతాలని తెలీక *                *                * నింగిన మెరిసే తారకలు ఎన్ని భగ్న ప్రేమికుల కథలో *                *                * పాట పాడుకుందామని తోట కెళితే రాలిన పువ్వు గాయాన్ని రేపింది *                *                * నీ ప్రేమ నాలో పాట పుట్టిస్తుందనుకుంటే మంట రేపింది *                *                * నువ్వు చేసిన గాయం గేయాన్ని పుట్టిస్తుందనుకున్నా కానీ నిస్తేజితుడిని చేసి  నిప్పుల గుండంలో పడేసింది *                *                * ప్రేమ విఫలమైతేనే మత్తులోన జోగుతారు అనుకుంటారు ప్రేమ ఎక్కువైనా మనసు మత్తువైపు మళ్ళుతుందని తెలీక *                *                *

చురకలు

చురకలు ********* ప్రజాస్వామ్యంలో తీర్పు గుప్పెడు ప్రజలదేనని అనుభవిస్తున్న గంపెడు ప్రజలకే తెలుసు *                 *                   * జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా ముందే తెలిసిన తీర్పుకు విచారణ యేలా *                 *                   * దార్శనికత అంటే భవిష్యత్తును నిర్మించడమే అనుకున్నామింతవరకు భవిష్యత్తును అమ్మేసుకోవడం అని రాబోయే కాలంలో కాబోయే అనుభవాలు తెలుపుతాయేమో *                 *                   * మౌనం అంటే మునిత్వ లక్షణం ఒకనాడు మౌనం ప్రధానమంత్రి పదవికి ఆభరణం నేడు *                 *                   * భూమి అలానే ఉంది భూమి నాది అన్న ప్రతివాడు భూమిలో కలిసిపోయాడు అవినీతి అలానే ఉంది అవినీతిని అంతమొందిస్తానన్న ప్రతివాడూ అవినీతి మకిలి అంటించుకుంటున్నాడు *                 *                   * 'నువ్వు చేయ్యగలవ'ని దేవుడు 'నీ వల్లే అవుతుంద'ని మనిషి కొట్టుకుంటూనే ఉన్నారు తరాల తరబడి మనుషులు మాత్రం మాయమైపోతున్నారు *                 *                   * హక్కులకోసం పోరాడతావు కానీ బాధ్యతలనుండి పారిపోతావేల? *                 *           

పుస్తకంలో పాత్రలు ...

వంశీ కలుగోట్ల// పుస్తకంలో పాత్రలు ... // *********************************** ఈ రోజుల్లో మనుషులు ముఖ పుస్తకాల్లోనే మాత్రమే ... బావుంటున్నారు  ఎంతో అందంగా  ప్రతి సమస్యకి స్పందిస్తూ పరిష్కారానికి పోరాడుతూ కూలంకుషంగా చర్చిస్తూ  రంగుల అభివృద్ధిని డిజిటల్ ఇండియాని అరచేతిలో స్వర్గంలా కళ్ళకు కట్టినట్టు చూపుతున్నారు ప్రధానమంత్రి నుంచి పక్కింటోడి దాకా పుస్తకంలోని పాత్రలైపోయారు ప్రముఖంగా వెలిగిపోతున్నారు రంగులేసుకుని రచ్చ చేస్తున్నారు ఆ రోజుల్లో పుస్తకంలోని పాత్రల్లా ఉండాలనుకునేవారు ఉదాత్తమైన లక్షణాలతో ఉన్నత ఆశయాలతో పుస్తకంలోని పాత్రలు గొప్పగా ఉండేవి పుస్తకం బయట బతుకుల్లో మామూలుతనం ఉండేది కొంతైనా మంచితనం ఉండేది ఎన్ని అవలక్షణాలు ఉన్నా అతినీచత్వం అంతగా ఉండేది కాదు ఇప్పుడు గొప్పతనమే కాదు మనిషిలోని మామూలుతనమూ పోయింది విలువలు లేని వ్యక్తిత్వాలతో ముసుగేసిన మనస్తత్వాలతో తామే చిత్ర విచిత్ర పాత్రలుగా ముఖ పుస్తకపు గోడలమీద డిజిటల్ రంగులద్దుకుని ... వెలిగిపోతున్నారు

కాల గమనం ...

వంశీ కలుగోట్ల // కాల గమనం ... // *********************************** రాజసూయ యాగాల నాడే రాజ్యకాంక్ష ఆపబడి ఉంటే ఈనాటి చరిత్ర పుస్తకాల్లో యుద్ధాలు ఉండేవి కావేమో జగజ్జేత కావాలన్న అలెగ్జాండర్ కోరిక ఆనాడు ఆదిలోనే ఆపబడి ఉంటే ఈనాడు అగ్ర రాజ్యాలు యుధ్ధవిమాన మోతలు ఉండేవి కావేమో అణుబాంబుల కాలంలో కూడా ఆయుధం పట్టకుండా యుద్ధం చెయ్యొచ్చని రక్తం చిందకుండానే విప్లవం లేవదీయోచ్చని సహనం ఉంటే విజయం సాధించొచ్చని గాంధీలు, మండేలాలు రుజువు చేసి ఉండకపోతే శాంతికి ఇంత విలువ ఉండేది కాదేమో ఆధునిక కాలంలో కూడా మాట మంత్రం కాగలదని మహాసైన్యాన్ని నడిపించగలదని సుభాష్ బోసు లాంటివారు చూపించకకపోయినట్టైతే మౌనం మన భాష అయ్యేదేమో అందాన్ని పొగడ్డమే కాదు అక్షరం విప్లవం కూడా పుట్టించగలదని  ఆయుధం కన్నా పదునైందని కవులు, రచయితలూ చూపకపోయినట్లయితే రాజ్యం సృష్టించిన అంధకారంలో ఉండిపోయేవారమేమో

స్పందన ...

వంశీ కలుగోట్ల // స్పందన ...// *********************** ఉరితాడు కొనే స్థోమత లేక పంట కోసమని కొన్న పురుగుల మందు కనీసం ప్రాణాలు తీసుకోవటానికి పనికొచ్చిందనే చిన్నపాటి తృప్తి కనబడుతోంది జీవం పోయిన ఆ కళ్ళలో పర్రలు చీలిన పొలం దాహార్తిని తీర్చలేక కన్నీటి తడి పొలానికి చేరలేదని దేహంలో ఇంకా యే మూలైనా స్వేదపు తడి మిగిలుంటే అది తీసుకుని తరువాతి తరాల ఆకలి తీర్చగలదేమో ఆ పొలం అనే ఆశతో మట్టిలో కలిసిపోతున్నాయి ఆ జీవితాలు నాయకుడా తెలుసుకో ... ఇవ్వాళ జాతికి కావలసింది విదేశీ కంపెనీలకు పంట పొలాలు ధారాదత్తం చేసి పల్లెను పట్నం చెయ్యటం కాదు రైతును ఆదుకుని ఆ భూమిలో పంట పండించేలా భరోసానివ్వడం గుర్తుంచుకో ముగిసిపోతున్న జీవితాలకు వెలకట్టడం మానేసి ఆగిపోతున్న ఆ గుండెలను ఇప్పుడు కాపాడకపోతే ఏదో ఒకరోజు నోటికంటే ముద్ద దొరకక మాడి చస్తావు ఈ చావులకు నువ్విప్పుడు స్పందించకపోతే రేపు నీ చావుకు స్పందించే దిక్కు కూడా ఉండదు

అస్థిత్వపు బలి ...

వంశీ కలుగోట్ల// అస్థిత్వపు బలి ... // ******************************** మట్టిలో ఏమీ లేదన్నాడు వాడు అదే నమ్మి అంతా డబ్బులోనే ఉందని మట్టిని వదిలేసి పరిగెత్తాడు గమ్యం తెలియక గానుగెద్దులా తిరిగి తిరిగీ అలసిపోయి వచ్చిన వాడిని తన ఒడిలో చేర్చుకుని సేద తీర్చింది మట్టి * గాలికి చెట్టుకు సంబంధం ఏమీ లేదన్నాడు వాడు అదే నమ్మి అడవులన్నీ కొట్టేశాడు ఆధునికత సృష్టించిన కలుషిత వాతావరణంలో స్వచ్చమైన ఊపిరికోసం ఆక్సిజన్ గదులు కట్టించుకున్నప్పుడు  తెలిసింది వాడికి గాలి, చెట్టు విలువ ఏమిటో * నీటిలో ఏమీ లేదన్నాడు వాడు అదే నమ్మి బావులు, కుంటలు, చెరువులు పూడ్చేసి భవనాలు కట్టాడు ఎన్ని తూట్లు పొడిచినా భూమిలోంచి చుక్క నీరు రాక దాహంతో అలమటిస్తున్నాడు ఈరోజు * ఆకాశం అంతా శూన్యమే అన్నాడు వాడు ఫ్యాక్టరీల పొగ గొట్టాలలోంచి వచ్చిన విషవాయువులు నింగికెగసి పొడిచిన పోట్లు చేసిన రంద్రాల లోంచి ఓజోన్ పోర చీల్చుకుని వచ్చిన అతినీలలోహిత కిరణాలు తెచ్చిన రోగాలు తెలిపాయి ఆకాశపు శూన్యంలో కనిపించని శక్తి ఉందని * నిప్పులో ఏమీ లేదన్నాడు వాడు అణువులోని నిప్పు కార్చిచ్చై మహానగరాలను కాల్చేసినపుడు కానీ అ

మరుపు ఓ శాపం ...

వంశీ కలుగోట్ల// మరుపు ఓ శాపం ... // ************************************ అనగనగా కథలో పాత్రలా గమ్యం తెలియని బాటసారిలా బ్రతుకుతున్నాడు వాడు నిలువుదోపిడీ చేసిన  నాయకుడు గోచీబట్ట ఇస్తానంటే సంబరపడిపోతున్నాడు నడిసంద్రంలో వదిలేసి కుక్కతోక పట్టుకుని ఈదమని చెప్పే నేతని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు మానని గాయాలు చెరిగిపోని మోసాలు కోల్పోయిన జీవితాలు మరిచిపోయి కాసింత మందు పోసి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి నాలుగు నోట్లు చేతిలో పెట్టగానే జై కొడుతున్నాడు ఎన్నికలొచ్చిన ప్రతిసారి కులమో, మతమో, ప్రాంతమో ఏదో ఒకటి చెప్పి ఉసిగొల్పి ఉస్కో అనేవాడికి దాసోహం అంటున్నాడు  ఉస్కో అన్నోడి చేతిలోనే కళ్ళేలు ఉన్నాయని చెర్నాకోల దెబ్బలు తన వీపుకేనని తెలిసీ అమ్ముడుపోవడం అలవాటైపోయిన సామాన్యుడు మరుపు ఓ వరం అనుకునే సమాజానికి కాదు అది ఒక శాపం అని ఋజువు చెయ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు