కొత్త వర్ణాల కోసం ...
వంశీ కలుగోట్ల// కొత్త వర్ణాల కోసం ...//
*************************************
మా'నవుడి' బొమ్మ గీయడానికి
సరికొత్త వర్ణాల కోసం
నా అన్వేషణ ...
కొనసాగుతూనే ఉంది
******************************
ఓ మా'నవుడి' బొమ్మ గీద్దామని
వర్ణాల కోసం అన్వేషణ మొదలు పెట్టాను
వర్ణాల కోసం అన్వేషణ మొదలు పెట్టాను
కొనసాగుతున్న యుద్ధం లోంచి
పుట్టుకొచ్చిన రక్తపు వాసనల ఎరుపు రంగు
పుట్టుకొచ్చిన రక్తపు వాసనల ఎరుపు రంగు
పుడమి పరచిన అడవి తివాచీలోని
చెట్ల ఊపిరి తీసి పిండుకొచ్చిన పచ్చరంగు
చెట్ల ఊపిరి తీసి పిండుకొచ్చిన పచ్చరంగు
జరుగుతున్నమారణహోమంలో
కాలుతున్న బ్రతుకుల మంటలలోని పసుపు రంగు
కాలుతున్న బ్రతుకుల మంటలలోని పసుపు రంగు
ఏ రంగుతో బొమ్మ గీద్దామన్నా అవి
ఏదో ఒక మంటలో కాలుతూ మసి పులుముకున్నాయి
ఏదో ఒక మంటలో కాలుతూ మసి పులుముకున్నాయి
మూలాలకు దూరం జరిగి
సంకుచితాలతో సంకరమై
పుట్టుకొచ్చిన కొత్త వర్ణాలు
వద్దనుకున్నాక చూస్తె
ఇక ఏ రంగూ మిగలలేదు
సంకుచితాలతో సంకరమై
పుట్టుకొచ్చిన కొత్త వర్ణాలు
వద్దనుకున్నాక చూస్తె
ఇక ఏ రంగూ మిగలలేదు
సరికొత్త వర్ణాల కోసం
నా అన్వేషణ ...
కొనసాగుతూనే ఉంది
Comments
Post a Comment