పుస్తకంలో పాత్రలు ...
వంశీ కలుగోట్ల// పుస్తకంలో పాత్రలు ... //
***********************************
***********************************
ఈ రోజుల్లో
మనుషులు
ముఖ పుస్తకాల్లోనే మాత్రమే
... బావుంటున్నారు
మనుషులు
ముఖ పుస్తకాల్లోనే మాత్రమే
... బావుంటున్నారు
ఎంతో అందంగా
ప్రతి సమస్యకి స్పందిస్తూ
పరిష్కారానికి పోరాడుతూ
కూలంకుషంగా చర్చిస్తూ
రంగుల అభివృద్ధిని
డిజిటల్ ఇండియాని
అరచేతిలో స్వర్గంలా
కళ్ళకు కట్టినట్టు చూపుతున్నారు
ప్రధానమంత్రి నుంచి పక్కింటోడి దాకా
పుస్తకంలోని పాత్రలైపోయారు
ప్రముఖంగా వెలిగిపోతున్నారు
రంగులేసుకుని రచ్చ చేస్తున్నారు
పుస్తకంలోని పాత్రలైపోయారు
ప్రముఖంగా వెలిగిపోతున్నారు
రంగులేసుకుని రచ్చ చేస్తున్నారు
ఆ రోజుల్లో
పుస్తకంలోని పాత్రల్లా ఉండాలనుకునేవారు
ఉదాత్తమైన లక్షణాలతో
ఉన్నత ఆశయాలతో
పుస్తకంలోని పాత్రలు గొప్పగా ఉండేవి
పుస్తకం బయట బతుకుల్లో
మామూలుతనం ఉండేది
కొంతైనా మంచితనం ఉండేది
ఎన్ని అవలక్షణాలు ఉన్నా
అతినీచత్వం అంతగా ఉండేది కాదు
పుస్తకంలోని పాత్రల్లా ఉండాలనుకునేవారు
ఉదాత్తమైన లక్షణాలతో
ఉన్నత ఆశయాలతో
పుస్తకంలోని పాత్రలు గొప్పగా ఉండేవి
పుస్తకం బయట బతుకుల్లో
మామూలుతనం ఉండేది
కొంతైనా మంచితనం ఉండేది
ఎన్ని అవలక్షణాలు ఉన్నా
అతినీచత్వం అంతగా ఉండేది కాదు
గొప్పతనమే కాదు
మనిషిలోని
మామూలుతనమూ పోయింది
విలువలు లేని వ్యక్తిత్వాలతో
ముసుగేసిన మనస్తత్వాలతో
తామే చిత్ర విచిత్ర పాత్రలుగా
ముఖ పుస్తకపు గోడలమీద
డిజిటల్ రంగులద్దుకుని
... వెలిగిపోతున్నారు
Comments
Post a Comment