ఆలోచనల్లోంచి ...

వంశీ కలుగోట్ల// ఆలోచనల్లోంచి ... //
******************************
*******
1
కమ్ముకున్న నివురును
వదిలిద్దామని
నిప్పును పట్టుకుంటే
నిజంలా
నిలువునా కాల్చేస్తోంది

2
అడవిలోకి
విసిరేసిన ప్రశ్నను
అధికారం
అణచివేస్తోంది

3
ప్రశ్నించడం
మర్చిపోయిన గొంతుక
ఇప్పుడు 
సమాధానాలు
వెతుక్కుంటోంది

4
బాధ్యతలు
మర్చిపోయిన ప్రజ
హక్కుల కోసం
పోరాడతానంటోంది

5
కిందున్న నీడ చూసి
కోటమీది జెండా
రాజ్యమంతా తనదేనని మురిసిపోయినట్టు
గెలిచిన పార్టీకి
వోటేసిన వాడు
ప్రభుత్వం తనదే అనుకుంటున్నాడు
ఇక జరిగేదంతా
మంచేననుకుంటున్నాడు

6
రోజూ వచ్చే ఉదయం
ఏదో ఒక రోజు
తన బతుకులో వెలుగు తెస్తుందనే
నమ్మకంతో
పోలానికెల్తున్నాడు రైతు

7
మన పిచ్చి కాకపొతే
కళ్ళముందు పిల్లలు
రాలుతుంటే రాని కన్నీరు
ఈ పాలకులకు
ఉల్లికోతకు వస్తుందా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...