సంతాపం ...

వంశీ కలుగోట్ల// సంతాపం ...//
******************************
పంట పండించి
అందినంతకి అమ్ముకుని
అప్పోసప్పో చేస్తూ
భారంగా బ్రతికినన్నాళ్లు
ఎవరూ పట్టించుకోలేదు

కష్టాలు తట్టుకోలేక
ధైర్యం చచ్చిపోయి
పురుగులు చావని మందుకు
మనుషులెలా చస్తారో
అర్థం కాక
అదేమందు తాగితే
ఇవాళ 
రైతు చనిపోయాడు
ఆత్మహత్య చేసుకున్నాడు
అంటున్నారు

బతికించాల్సిన పంటని
పండించే భూమిని
కాపాడాల్సిన జీవితాల్ని
పట్టించుకోని వాళ్ళు
శవానికి
వెల కడుతున్నారు

కిరాణా కొట్టులో
పాతికకు కొన్న సరుకును
సూపర్ మార్కెట్ లో వందకి కొనేవాడికి
వంద కాకపొతే
వెయ్యిచ్చి ఓటు కొనేవాడికి
గోడు వినే ఓపిక తీరికా లేవు
శవానికి
సంతాపాలు తెలపడం తప్ప

అయినా
వృధా ప్రయాస కాకపొతే
కంప్యూటర్ హృదయమున్న
పాలకులకు
ఉరేసుకుంటున్న రైతుల జీవితాలు
తరుగుతున్న పొలాల విలువ
తెలుస్తుందా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...