మనుషులు కావాలి ...
వంశీ కలుగోట్ల // మనుషులు కావాలి ...//
*****************************************
పరుగులు తీస్తున్న ప్రపంచానికి
గోడమీదకెక్కి గంతులేసే మనిషి
దేవుడికోసం ఎదురుచూసే
తూర్పు తిరిగి దణ్ణం పెట్టే
*****************************************
ఈ ప్రపంచాన్ని నడిపించేందుకు
మనుషులు కావాలి ...
పరుగులు తీస్తున్న ప్రపంచానికి
యంత్రాలమయమైపొయిన జీవితాలకి
అలుపు తీర్చే వ్యాపకం కావాలి
గోడమీదకెక్కి గంతులేసే మనిషి
మనసుకు కళ్ళాలు వేసి కళ్ళు
తెరిపించే జ్ఞానం రావాలి ...
దేవుడికోసం ఎదురుచూసే
మతం గురించి కొట్టుకునే
దుర్బలుల మధ్య ...
ఇనుప కండలు, ఉక్కు నరాల
యోధాగ్రేసరులు ఉద్భవించాలి
తూర్పు తిరిగి దణ్ణం పెట్టే
తుప్పు పట్టిన మెదళ్ళను
మొదలు నుంచి ప్రక్షాళన
కావించే విప్లవం రావాలి
కావించే విప్లవం రావాలి
మానవత్వం మిగిలున్న
సాధించే సహనమున్న
పోరాడే గుణమున్న
మనుషులు కావాలి
Comments
Post a Comment