దేవుడా...
దేవుడా...
**********
నువ్వే దిక్కు అన్నందుకు
ఇదా నువ్వు చూపించే ఫలితం
నువ్వు తప్ప ఇంకెవరూ ఏమీ
చెయ్యలేని, మార్చలేని తీరుకి
పరిస్థితుల్ని తీసుకురావడమేనా
నువ్వు చూపిన దిక్కు
ఇంకెప్పుడూ, ఎక్కడా, ఎవరికీ
మళ్ళీ చెప్పకు, అనకు
మళ్ళీ మళ్ళీ జన్మించి
అక్రమాల్ని అణచివేస్తానని
ఎదురుచూడటం అలవాటైపోయింది జనాలకు
తోలు మందమైపోయింది అక్రమార్కులకు
**********
నువ్వే దిక్కు అన్నందుకు
ఇదా నువ్వు చూపించే ఫలితం
నువ్వు తప్ప ఇంకెవరూ ఏమీ
చెయ్యలేని, మార్చలేని తీరుకి
పరిస్థితుల్ని తీసుకురావడమేనా
నువ్వు చూపిన దిక్కు
ఇంకెప్పుడూ, ఎక్కడా, ఎవరికీ
మళ్ళీ చెప్పకు, అనకు
మళ్ళీ మళ్ళీ జన్మించి
అక్రమాల్ని అణచివేస్తానని
ఎదురుచూడటం అలవాటైపోయింది జనాలకు
తోలు మందమైపోయింది అక్రమార్కులకు
Comments
Post a Comment