సరికొత్తగా పుట్టుకురా ...

వంశీ కలుగోట్ల //  సరికొత్తగా పుట్టుకురా ...//
***************************************
కొత్త కోసం కోత మొదలవుతోంది
నీలోంచి పాతని పాతరెయ్

పట్టిన బూజును, అంటిన దుమ్మును
వేసిన ముసుగును వదిలేయ్

బహిరంగ ఆధునికుడా, నీ లోలోని
జాడ్యాలను మూలానికంతా ఊడబీకేయ్

కుబుసం విడిచి కొత్త పుట్టుక పుట్టే నాగులా
నీలోంచి నువ్వు మళ్ళీ సరికొత్తగా పుట్టుకురా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...