తీరం నుంచి ఎడారి దాకా...
వంశీ కలుగోట్ల// తీరం నుంచి ఎడారి దాకా...//
********************************************
వాడెవడో వచ్చి
నాలా నేను నటించటానికి
డబ్బులిస్తానంటున్నాడు
అయిదేళ్ళకోసారి
ఓటేస్తే చాలంటున్నాడు
* * *
తీరంలో పాదముద్రలు
ఇంకా ఉంటాయా
అక్కడక్కడా మిగిలున్న
మానవత్వపు జాడలా
* * *
తీరం నుంచి ఎడారి దాకా
సాగిన పయనంలో
ఎన్ని పాదముద్రలు కోల్పోయానో
* * *
కాలం ఎప్పటికప్పుడు
తుడిపేస్తూనే ఉన్నా
గాయాలు మాత్రం గతాన్ని
గుర్తు చేస్తూనే ఉన్నాయి
* * *
ఎవరూ లేని తీరంలో
అయలాన్ లాంటి అలేదైనా వస్తుందేమోనని
ఒంటరి దీపపు స్థంభంలా
ఎదురు చూస్తూ నుంచున్నా
* * *
తీరం అయినా
ఎడారి అయినా
ఇసుకే కదా
********************************************
వాడెవడో వచ్చి
నాలా నేను నటించటానికి
డబ్బులిస్తానంటున్నాడు
అయిదేళ్ళకోసారి
ఓటేస్తే చాలంటున్నాడు
* * *
తీరంలో పాదముద్రలు
ఇంకా ఉంటాయా
అక్కడక్కడా మిగిలున్న
మానవత్వపు జాడలా
* * *
తీరం నుంచి ఎడారి దాకా
సాగిన పయనంలో
ఎన్ని పాదముద్రలు కోల్పోయానో
* * *
కాలం ఎప్పటికప్పుడు
తుడిపేస్తూనే ఉన్నా
గాయాలు మాత్రం గతాన్ని
గుర్తు చేస్తూనే ఉన్నాయి
* * *
ఎవరూ లేని తీరంలో
అయలాన్ లాంటి అలేదైనా వస్తుందేమోనని
ఒంటరి దీపపు స్థంభంలా
ఎదురు చూస్తూ నుంచున్నా
* * *
తీరం అయినా
ఎడారి అయినా
ఇసుకే కదా
నా మతమైనా
మానవత్వమే కదా
Comments
Post a Comment