Posts

... గాయాలు

వంశీ కలుగోట్ల // ... గాయాలు // ****************************** * కొన్ని గాయాలు గుర్తులుగా మిగిలిపోతుంటాయి  నడక నేర్చుకునేటప్పుడో అడుగులు తడబడినప్పుడో నడవడిక సరిగా లేకనో గాయాలు అవుతుంటాయి అవి గుర్తులుగా మిగిలిపోతాయి *            *            * కొన్ని గాయాలు వెంటాడుతూనే ఉంటాయి  కాలం మరచిపోతుందేమో కానీ, హృదయం మరచిపోలేని గాయాలు కొన్నుంటాయి ప్రేమ ఓడిపోయో బంధం విడిపోయో స్నేహం మాటున ద్రోహమో హృదయానికి తగిలే గాయాలు వెంటాడుతూనే ఉంటాయి ఎప్పటికీ *            *            * కొన్ని గాయాలు గేయాలవుతుంటాయి  ఒక్కొక్కడు ఒక్కో రకం పక్కోడికి దెబ్బ తగిలినా పువ్వు నలిపేయబడినా ప్రపంచం బాధని తమ బాధలా భావించే భావుకులుంటారు బాధను అనుభవిస్తూ గేయాలు స్రవిస్తుంటారు *            *            * కొన్ని గాయాలు విప్లవాలవుతుంటాయి  బంధించి కొడితే పిల్లి పులి అవుతుందో లేదో అణచివేయాలని చూస్తే కడుపు మండినోడు మాత్రం తిరుగుబాటు చేస్తాడు వాడి గాయం విప్లవాన్ని సృష్టిస్తుంది

గమనం ...

వంశీ కలుగోట్ల // గమనం ... // ****************************** ఆగిపోయిన చోటునుంచే             మొదలవ్వాలనే ప్రయత్నం అవునూ ఇంతకీ ఎక్కడ ఆగిపోయాను? మనిషితనం వదిలేసి ఆధునికత్వం మొదలైనచోటా ఎదగటం అంటే ఎదుటివాడిని అణచేయటం అని పాఠం నేర్చుకున్నచోటా మనిషి అంటే మతం అని అర్థం చెప్పుకున్న చోటా అడుగడుగునా నన్ను నిలిపేసిన గోతులు కనబడుతూనే ఉన్నాయి అంటే పయనించిందంతా             పతనం వైపేనా

విద్యార్థిగానే బతికితీరాలి

వంశీ కలుగోట్ల // ... విద్యార్థిగానే బతికితీరాలి //   *************************** *************** వాడు అడిగాడు    'నాన్నా జీవితం ఎప్పుడు మొదలవుతుంది?' అని 'ఈ బడిలో ఉన్నన్నాళ్ళూ బాగా చదువు    ఆ తరువాత జీవితం అనుభవించవచ్చు'  అని  నాన్న చెప్పాడు  'నాన్నా జీవితం ఇప్పుడు మొదలవుతుందా?'   అడిగాడు వాడు బడి అయిపోయాక 'ఈ ఇంటర్ రెండు సంవత్సరాలూ కష్టపడి    ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ కొట్టరా    ఆ తరువాత తిరుగుండదు' అన్నాడు నాన్న  'నాన్నా మరి ఇపుడు జీవితం మొదలయినట్టేనా?'   అని అడిగాడు వాడు    ఇంజనీరింగ్/మెడిసిన్ లో సీట్ వచ్చాక 'ఈ నాలుగేళ్ళూ చదివేస్తే ...    జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు'    అన్నాడు నాన్న  వాడు సమాధానపడ్డాడో    లేక రాజీ పడ్డాడో తెలియదు    ప్రతి మలుపులోనూ    తెలియని బాధను  లోపలి పొరల్లో దాచుకుని    గడుపుతూనే ఉన్నాడు  వాడికి తెలుసు    తాను చస్తూ బ్రతుకుతున్నానని    చచ్చి బ్రతకబోయేముందు    వాడు రాసుకున్నాడు ... "ఇకనైనా జీవితం మొదలవుతుంది    అనుకున్న ప్రతి మలుపులోనూ    పాఠాలు ఎ

... జ్ఞాపకం

వంశీ కలుగోట్ల // ... జ్ఞాపకం // ****************************** **** వాడు ఎవరని అంటే  వాడు చెప్పుకునే కులం కాదు  నమ్మే మతమూ కాదు  చేసే పని కాదు  చెప్పే మాట కాదు  నిష్క్రమించినరోజున  రెండు కన్నీటిచుక్కలు  మిగిల్చే చిన్న జ్ఞాపకం  మాత్రమే వాడు  ఉన్నోళ్లు చూసేది  వాడు ఏమి  సాధించి పోయాడో  అని కాదు  వాడు ఏమి  మిగిలించి పోయాడో అని  వాడి జ్ఞాపకపు విలువ  వాడు వదిలి వెళ్లిన  విషయాన్ని బట్టి ఉంటుంది 

వేదాంతం - విజ్ఞానం

వంశీ కలుగోట్ల // వేదాంతం - విజ్ఞానం // ****************************** *************** పొగ పొరలేమిసేయును కరిగి కనులముందే పొరలుగా కరిగిపోయేను యని వేదాంతసారమును వివరించ యత్నించే ధూమపానబానిసయొకడు విషపు చుక్క యది ఒకేనొక్కటి యైననేమి కడివెడు పాలనైనను బలితీసుకొనగలదని విజ్ఞానపు పొరలను విడదీసి వాడు వివరించే

... ఎవరిగోల వారిది

వంశీ కలుగోట్ల // ... ఎవరిగోల వారిది // ****************************** ********* మొక్క ఎదుగుతోంది             చెట్టుగా పదిమందికి నీడనిస్తూ మనిషి ఎదుగుతున్నాడు             గొప్పోడిగా పమందిని అణగదొక్కుతూ ... *            *            * వాడన్నాడు అది             ఆవేశమని వైద్యుడన్నాడు అది             రక్తపోటని మూర్ఖులనుకున్నారు అది             తమకోసం పోరాటమని *            *            *             ఆమె అంటుంది వాడి  ప్రేమ గొప్పది అని             వాడు ఇచ్చిన బహుమతులన్నీ చూపుతూ              వీడు పంచిన జీవితాన్ని కాలదన్నుతూ

... ప్రేమగా జీవించు

వంశీ కలుగోట్ల // ... ప్రేమగా జీవించు // ****************************** ************** ఏ తీరున యోచించినన్ ఏ దిక్కున పరికించినన్ కన్పట్టుచుండిరి ప్రియుల్ భావింపకుమన్యదా నాపలుకుల్ పలురకములీ  ప్రియుల్ యనిదెల్పుటయే దప్పించి లేదిచట మారుద్దేశము మదిభారము బోవునని ఎవరో సెలవివ్వగన్ మధుశాలకు నేను బోవ కన్పడిరి యచట మధుపాన ప్రియుల్ ప్రకృతి పరవశింపజేయున్ యని పచ్చటి పల్కుల విని ఉద్యానవనమున కేగ కాంచితిని యచటన్ కాంతా ప్రియులన్ చల్లగాలికి తిరుగుదుమని పిల్లగాలికి యారాటపడుచు సంజె చీకట్లమాటున వాడలవెంట తిరుగుచున్న వారదిగో రసిక ప్రియుల్ ప్రపంచమును ప్రక్కకు త్రోసివేసి అక్షరమును ఆస్వాదించుటకున్ మించిన యానందమున్నదాయంచు గ్రంథాలయ మునకేగు  చున్నారాదిగో పుస్తక ప్రియుల్ తలిదండ్రుల, మిత్రుల మించి తెరమీది బొమ్మలను వేల్పులుగ తలచుచు దారినబోవుచున్నా రదిగో సినిమా ప్రియుల్  ... ... వివరించవలెనా ఇంకనూ ప్రేమించగలిగే మనసున్న చాలున్ ఎందెందు వెదకున కనబడు ప్రేమను మరచి ఇంకా యేల ఈ తిరుగులాటల్ తీవ్రవాదముల్