... జ్ఞాపకం

వంశీ కలుగోట్ల // ... జ్ఞాపకం //
**********************************
వాడు ఎవరని అంటే 
వాడు చెప్పుకునే కులం కాదు 
నమ్మే మతమూ కాదు 
చేసే పని కాదు 
చెప్పే మాట కాదు 

నిష్క్రమించినరోజున 
రెండు కన్నీటిచుక్కలు 
మిగిల్చే చిన్న జ్ఞాపకం 
మాత్రమే వాడు 

ఉన్నోళ్లు చూసేది 
వాడు ఏమి 
సాధించి పోయాడో 
అని కాదు 
వాడు ఏమి 
మిగిలించి పోయాడో అని 

వాడి జ్ఞాపకపు విలువ 
వాడు వదిలి వెళ్లిన 
విషయాన్ని బట్టి ఉంటుంది 

Comments

Popular posts from this blog

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్

విద్యార్థిగానే బతికితీరాలి

నివాళి