Posts

Showing posts from June, 2016

... వార్తలు/వాస్తవాలు

వంశీ కలుగోట్ల // ... వార్తలు/వాస్తవాలు // *************************************** ఒక భారీ వర్షం  నగరాన్ని పలకరించిన వేళ  మురుగునీటి ఉధృతికి  మాన్ హోల్ మూత తెరుచుకుంది  అవసరమైనదేదో కొందామని  ఇంటినుండి బయటకొచ్చిన సామాన్యుడు  దానికి బలయ్యాడు ఒక కుటుంబం బాధ పడింది  మరుసటి రోజున  పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది *                 *                 * బాధ్యతలు తరుముతుంటే  బతుకు పోరాటంలో భాగంగా  రోజూలానే వాడు బైక్ మీద  ఆఫీసుకి బయల్దేరాడు తాగుడు హైజాక్ చేసిన మనిషొకడు  డ్రైవర్ గా నడుపుతున్న లారీ ఒకటి  వెనకనుండి వాడిని గుద్దింది  తప్పిచుకునే అవకాశమూ లేదు  వాడి జీవితం అక్కడే ముగిసిపోయింది ఒక కుటుంబం బాధ పడింది  మరుసటి రోజున  పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది *                 *                 * రోజూలానే సాయంకాలం  తన హాస్టల్ గదికి తిరిగొచ్చింది ఆ అమ్మాయి  తెలియదు ఆ అమ్మాయికి  కాలేజ్ లో  తనను కోరిక తీర్చమని అడిగిన పశువుది   పక్క గదిలో ఉండే సీనియర్ అమ్మాయిదీ  ఒకటే కులమని, తనది వేరే కులమని  తెలుసుకుని అర్ధమయ్యేసరికి  ఉరితాడుకు ఆ జీవితం  బలైపో

... ప్రేమించటానికే తీరిక లేదు

వంశీ కలుగోట్ల // ... ప్రేమించటానికే తీరిక లేదు  // ****************************** ************************** వాడొచ్చాడు నా ఇంటికి  అదేదో మతాన్ని, ఇంకేదో పద్ధతిని  మనల్ని తిడుతున్న ఆ వర్గాన్ని  ద్వేషించమన్నాడు  పుట్టినతరువాత  అందరూ అంటగట్టిన కులాన్ని/మతాన్ని  పరిరక్షించుకోవాలంటూ  నాకు కర్తవ్యబోధ చేయసాగాడు 'ప్రకృతిని, ప్రపంచాన్ని  మానవత్వాన్ని, మనిషిని  ప్రేమించటంలో  నేను తీరికలేకుండా ఉన్నాను  ద్వేషించేంతటి సమయం నాకు లేదు'  అని చెప్పాను  ఆ వర్గంలో/కులంలో/మతంలో  చెడబుట్టానని తిడుతూ వెళ్ళిపోయాడు  ఆ ఆవేశం  చూస్తుంటే జాలేసింది  అసలు తత్వం తెలుసుకోలేక  గిరి గీసుకుని  తనను తాను ఒక పరిమితుల చట్రంలో  బంధించుకుంటున్న ఆ మేధావిని చూసి 

... నేల దుఃఖం

వంశీ కలుగోట్ల // ... నేల దుఃఖం // ****************************** ఆ దారి తాను వేసిందేనని వాడు అందరితో అంటున్నాడు తరాల తరబడి అక్కడే ఉన్న నేల అది విని దుఃఖించింది బాధతో  తన నుంచి వేరు చేయబడిన వృక్షాల సంఖ్యను లెక్కించుకుంటూ తనలో తాను అనుకుంది 'ఇంతవరకూ ముందుకు నడవడానికి గమ్యం చేరటానికి దారులు వేసుకునే వాళ్ళను చూసాను తమ పతనానికి తామే దారులు వేసుకుంటున్న వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను'

వాడు ... వీడు ... ఇంకోడు ...

వంశీ కలుగోట్ల // వాడు ... వీడు ... ఇంకోడు ... // ****************************** *********************** 1 వాడెవడో అన్నాడు  నన్ను మించినోడు లేదు  నా అంతటి దార్శనికుడు లేడు  ప్రపంచానికే పాఠాలు చెప్పాను  అభివృద్ధికి దారి వేశాను  మీరు సాగిపోండి అని  సాగుతున్న జనానికి  కాసేపటికి అలుపొచ్చాక  సేదదీరదామని చూస్తే  నీడనివ్వటానికి చెట్టూ లేదు  తిండి పెట్టటానికి పొలమూ లేదు  దార్శనికత అందించిన ఫలితాలు  అర్థమయ్యాయో లేదో  2 పెరటిలో ఉన్న చెట్టు  సొంత వైద్యానికి పనికి రాదంట  తాను ఊరందరికీ  ధైర్యాన్నివ్వడానికి ఎప్పుడూ సిద్ధమే  కానీ, తన బాధను తీర్చేవారు లేరని  భరించలేని బాధ  ఎవరికెవరీ లోకంలో  ఎవరి బాధకు ఎవరు ఓదార్పు  దేవుడే చూసుకుంటాడు  కానీ, ప్రయత్నం ఆగదు  ఆశ ఆగనివ్వదు కదా  3 ఎంత ...తనముంటే ఏమి లాభం  ఊరందరి పెళ్ళిళ్ళకూ వెళ్లడమే తప్ప  తనకు పెళ్ళి కావటం లేదు  అందరి పెళ్ళిళ్ళలో  వంటకాలు బావున్నాయనడమే తప్ప  పెళ్ళి భోజనం పెట్టే యోగం లేదేమో  ఊరందరికీ ఏనాడో ఒకనాడు  తానూ నచ్చనా  అందరూ కలిసి  తనకూ పెళ్ళి చేయకపోతారా అని  ఎదురు చూపులు ఎప్పటికి తీరతాయో కోర

... అర్థమవ్వాలి

వంశీ కలుగోట్ల // ... అర్థమవ్వాలి // ********************************* వాడు వేరు ఇంకోడు వేరని అర్థం చేసుకోవటానికి వాడికి గొడవ అవసరమయ్యింది *             *             * మాటకూ మౌనానికి మధ్య తేడా అధికారమేనని తెలుసుకోవటానికి వాడికి పదవి అవసరమయ్యింది *             *             * తనది అనుకున్న ప్రతిదీ తనది కాదని తెలుసుకోవటానికి వాడికి మరణం అవసరమయ్యింది

నన్ను నాకిచ్చెయ్యి

వంశీ కలుగోట్ల // నన్ను నాకిచ్చెయ్యి // ******************************************* నాలోంచి నేను పారిపోవాలనిపిస్తుంది  నీతో ధైర్యం చేసి మాట్లాడలేనప్పుడు  నన్ను నేను కొత్తగా చూసుకున్నాననిపిస్తుంది  నీ కళ్ళలో నన్ను చూసుకున్నప్పుడు  నీతో మాట్లాడగలిగిన ప్రతిక్షణం  ఒక జీవితమంత విలువైంది నాకు  నీవు పాట పాడుతున్నప్పుడు  నేను గాలినై అందులో కలిసిపోవాలనిపిస్తుంది  అనుక్షణం నీ చూపు వెంటాడుతుంటే  నీ ఊసులు మదిని కదిలిస్తుంటే  పారిపోలేక నిను ప్రార్థిస్తున్నా  నాన్ను నాకు తిరిగి ఇచ్ఛేయ్యామని ...  ఎందుకంటే నాలోని నేను  ఎప్పుడో నీ నీడనయ్యాను గనుక 

శుభాకాంక్షలు

వంశీ కలుగోట్ల // శుభాకాంక్షలు //  ************************************ సూర్యుడికన్నా ముందే  నీకు శుభాకాంక్షలు చెప్పాలనుంది  పరిమళించిన గులాబీని  నీ చెంతకు చేర్చాలనుంది  ఉషోదయ కిరణాల కాంతిలో  మెరిసే నీ కన్నుల్లో  నా సంతోషాన్ని చూసుకోవాలనుంది  చిరుగాలి స్వరాలు పేరుస్తోంటే  ప్రకృతి అంతా నా చెంత నిలిచి  నీకోసం ఎదురు చూస్తోంది  నాకన్నా ముందు నీకు  శుభాకాంక్షలు చెప్పాలని 

ద్వి ...

వంశీ కలుగోట్ల // ద్వి ... // ************************* మొదటి అడుగు పడినప్పుడు వాళ్ళందరూ 'ఏం చేశాడురా?' అన్నారు ప్రయాణం పూర్తయ్యాక వాళ్ళందరూ 'ఏంచేశాడురా!' అన్నారు *              *              * వెలుతురు భరించలేక వాళ్ళందరూ చలువ కళ్లద్దాలు పెట్టుకున్నారు రాత్రయ్యాక చీకటయ్యిందని వాళ్ళందరూ దీపాలు వెలిగించి కూచున్నారు *              *              * బతుకు కోసం ఊరొదిలితే వాళ్ళందరూ 'పిరికోడు' అన్నారు ఉద్యోగం కోసం దేశం వదిలితే వాళ్ళందరూ 'గొప్పోడు' అన్నారు *              *              * పలకరింపుగా నమస్కరిస్తే వాళ్ళందరూ నన్ను పట్టించుకోలేదు ఎన్నికలప్పుడు నమస్కరిస్తే వాళ్ళందరూ నన్ను నాయకుడని అన్నారు

నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ...

వంశీ కలుగోట్ల // నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ... // ****************************** ************************* ఊరు దాటి వెళ్లాలంటే  సమయానికి అందగలిగితే ఆర్టీసీ బస్సు  లేదంటే ఎడ్ల బండి అంతే  అదీ కాదంటే పదకొండో నంబరు బస్సు (కాలినడక) బస్టాండ్ దగ్గర ఒకవైపు ఒక కోనేరు  మరోవైపు ఒక పెద్ద వేపచెట్టు, దాని కింద అరుగు  అమ్మానాన్నలకు ఎలా ఉండేదో తెలీదు కానీ  బస్సు ఎంత ఆలస్యమయినా  మాకు విసుగుండేది కాదు  వనభోజనానికో లేక  విహారయాత్రకో వెళ్లినట్టుండేది  *                *                * మా ఊరి నుండి కర్నూలుకి  వెళ్ళేటప్పుడు కానీ, వచ్ఛేప్పుడు కానీ  రోడ్డుకు ఇరువైపులా  రహదారి మీదకి వంగినట్టు ఉండే  చెట్లను చూస్తే భలే ఉండేది  నడి వేసవి కాలంలో కూడా  ఆ దారిలో పయనం బావుండేది  *                *                * ఇప్పుడు ఆ బస్టాండ్ దగ్గరకు వెళితే  ఒక నిరాశవీచిక కమ్మేస్తుంది  అక్కడ కోనేరు లేదు  నిర్మానుష్యంగా నిర్జీవంగా  దూరంగా విసిరేసినట్టు అనిపిస్తుంది  అసలు అక్కడ ఉండాలనిపించట్లేదు  మా ఊరి నుండి కర్నూలుకు  ఇప్పుడు ఆ దారిలో వెళుతుంటే  మనసు అదో ర

నాకంతా నువ్వే ...

వంశీ కలుగోట్ల // నాకంతా నువ్వే ...//  ****************************** *********** కంటినుండి  ఒక నీటి చుక్క రాలిపడింది  అది ఆనందపు ఆలేమోననుకున్నాను  కానీ, అది నీ విరహంలో విషాదవీచిక అని  నిను చూసినపుడు తెలిసింది  నీ జ్ఞాపకాల్లో వున్నాననుకున్నాను  కానీ, అసలు నేనే లేనని  నీతో ఉన్నప్పుడు తెలిసింది  నాదంతా కవిత్వమనుకున్నాను  కానీ, అదంతా నీ రూపేనని  నిను కలిసినపుడు తెలిసింది  నను నీ దివ్యరూపం చూస్తూండనీ  అశృసృజన నయనాలతో నీ కోసం  వేచి చూస్తుండనీ ...  నువ్వే ... నాకంతా నువ్వే  నా సర్వస్వం నువ్వే 

'నీవు'గానే ...

వంశీ కలుగోట్ల // 'నీవు'గానే ... // *********************************** ఓ అందమైన అమ్మాయీ  ఎందుకు ... ? ఎపుడూ ఎవరితోనో  నిన్ను పోల్చాలనుకుంటావు  చందమామలాగానో  గులాబీలాగానో  మెరిసేతారకలాగానో  ఇంకెవరిలాగానో  మరెవరిలాగానో  ఎందుకివన్నీ?  ఎవరిలాగానో వున్నావనో  మరెవరినో మరిపిస్తావనో  నిన్ను ఇష్టపడలేదు  నిన్ను 'నిన్ను'గానే  ఇష్టపడ్డాను, ప్రేమించాను  'నీవు'గానే ఉంటేనే  ఇష్టపడతాను  నాకు  నీవు 'నీవు'గానే కావాలి ఇంకెప్పుడూ  ఇంకెవరితోనో పోల్చమని  నిన్ను పొగడమని అనొద్దు  'నీవు'గానే ఉండు  'నీవు'గానే బావుంటావు 

కొన్ని కొన్ని అంతే భయ్యా ...

వంశీ కలుగోట్ల // కొన్ని కొన్ని అంతే భయ్యా ... // *********************************************** కొన్ని అర్థం కావు కొన్ని ఎంతకీ మారవు కొన్ని ఎప్పటికీ అలానే ఉంటాయి అదంటే ఆ తీరు మనకెక్కదు అర్థమన్నట్టు నటిస్తూ ఉండాలంతే *                *                * పడేసిన ఖాళీ కాఫీ కప్పు రీసైకిల్ పేరుతో పునరుజ్జీవనం పొంది మళ్లీ కాఫీ నింపుకుని వచ్చింది కానీ, కొత్త చొక్కామీద కాఫీ పడిందని గొడవపడిన మేమిద్దరం మాత్రం ఇప్పటికీ మళ్లీ కలవలేదు *                *                * పోయినేడాదికి ఇప్పటికీ మా ఊరి దేవుడికి ఆదాయం పెరిగింది ఉత్సవాలకు అలంకారాలు ఈసారి కేక ఉత్సవాలకు పల్లకీ మోసే బోయీ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాడు *                *                * వాడు మాలో ఒకడుగా ఉండేవాడు రెండేళ్ళక్రితం వఛ్చి అడిగాడు మనం మనం ఒక కులపోళ్ళం అవును కదా అడిగాడు కదా అని ఓటేశా ఇప్పుడు వాడు బాగా ఎదిగిపోయాడు ఓటేసిన మేమందరం అలాగే, అక్కడే ఉన్నాం మా స్థాయిలు ఇప్పుడు మారిపోయినా మా ఇద్దరి కులం మాత్రం ఇప్పటికీ ఒకటే *                *                * పాపం చేసినోడే గుడికి వెళతాడ

వాడు నిజం కాదని ఎవరు చెప్పాలి?

వంశీ కలుగోట్ల// వాడు నిజం కాదని ఎవరు చెప్పాలి? // ****************************** *********************** వాడు మామూలోడు కాడు   పేదలకు అండగా నిలుస్తాడు  న్యాయాన్ని నిలబెడతాడు  అన్యాయాన్ని పెకలించివేస్తాడు  వందమందిని అయినా సరే  తానొక్కడే ఒంటిచేత్తో ఎదుర్కొంటాడు  పక్కోడి ప్రాణం కాపాడటానికి  తన ప్రాణం అడ్దేయటానికి ముందుంటాడు  షాట్ ఓకే కాగానే  అందరూ చప్పట్లు కొట్టగానే  విజయం కళ్ళముందు అప్పుడే కనబడుతుంది వాడి పాత్ర అలాంటిది మరి వాడి సినిమా సూపర్ హిట్టవుతుంది  *                      *                      * వాడు దేవుడిలాంటోడు  వాడిని మించిన మంచోడు ఉండడు  వాడకి సాటెవరూ లేరు  వాడంటే ఒక సైన్యం  మళ్ళీ పుట్టిన మహానుభావుడు వాడు  వాడి చుట్టూ ఉన్న పాత్రలన్నీ  అలానే చెబుతుంటాయి  షాట్ ఓకే కాగానే  అందరూ చప్పట్లు కొట్టగానే  విజయం కళ్ళముందు అప్పుడే కనబడుతుంది వాడి పాత్ర అలాంటిది మరి వాడి సినిమా సూపర్ హిట్టవుతుంది  *                      *                      * ఏ చరిత్ర చూసినా  ఇంతవరకూ నాయకులు  పార్టీలలోంచి, కులాలలోంచి పుట్టి ఉంటారు  వీడు

మహానుభావులు ...

వంశీ కలుగోట్ల // మహానుభావులు ...// *************************************** రాందేవ్ బాబా యోగా గురించి  జగ్గీ వాసుదేవ్ ప్రవచనాల గురించి  రవిశంకర్ బోధనల గురించి  ఎక్కడో ఉన్నాయని ఎవరో రాసి పడేసిన  ధర్మసూత్రాల సారపు టపాలను  అబ్బో తెగ షేరుతారు అందరూ   తనకు తానే ఒక ధర్మ పరిరక్షకుడిలా   ధర్మం తప్పని, నీతిగీతలు దాటని వాడిలా  తెగ రాతలు రాసి పడేస్తారు   బడ్డీ కొట్టు దగ్గర పని పిల్లాడు  తెచ్చి ఇచ్చిన చాయ్ తాగుతూ  చిదిమేయబడుతున్న బాల్యం గురించి బారులో కూచుని బీరు తాగుతూ  పతనమవుతున్న ప్రజాస్వామ్యం గురించి  సగంబట్టల అమ్మాయిల డాన్సులు చూస్తూ  సంస్కృతీసాంప్రదాయాల గురించి  అబ్బో తెగ లెక్చర్లు దంచేస్తారు  ఎంతైనా మనవాళ్ళు మహానుభావులు  

ప్రపంచాధినేతే అయినా ...

వంశీ కలుగోట్ల// ప్రపంచాధినేతే అయినా ... // *************************************************** బావగారి వాక్కు ...  ఆయన వచ్చేవరకూ  రాయలసీమ ప్రజలకు  గొడ్డుకారం తప్ప  వేరే తిండి తెలియదు  మరిదిగారి ప్రవచనం ...  ఆయన వచ్చేవరకూ  తెలంగాణా ప్రజలకు  తెల్ల అన్నం అంటే  ఏమిటో తెలియదు  మిగతా ప్రాంతాల  ప్రజల పరిస్థితి  తెలుసుకోవాలని ఉందా  చూస్తూనే ఉండండి  బావామరుదుల ప్రవచనాలు  ప్రపంచానికి అధినేత అయినా  ఒక తల్లికి కొడుకే  అది పాచిపోయిన పాత సామెత  ప్రపంచానికి అధినేతే అయినా  పెద్ద కంపెనీకి సీఈఓ అయినా  ఏ దేశపు మంచోడైనా  బావ నుంచి స్ఫూర్తి పొందినోళ్లే  మరిది అండ చూసుకున్నోళ్ళే 

యుద్ధం ముగిసింది ...

వంశీ కలుగోట్ల// యుద్ధం ముగిసింది ... // ****************************** ******* అవును, వాడికిప్పుడు  యుద్ధంతో అవసరం లేదు  తన లక్ష్యం చేరాక  తన పయనం ముగిసాక  తన అవసరం తీరాక  శాంతి మంత్రం పఠిస్తాడెవడైనా  ఇప్పుడు వాడికి కావాల్సింది యుద్ధం కాదు  తను మొదలెట్టిన యుద్ధంలో  మాడిపోయిన శలభాల గురించి  బలైపోయిన సామాన్యుల గురించి  వాడికి చింత లేదు  యుద్ధపు విజయాన్ని శాశ్వతంగా మలచుకోవటానికి వారసత్వంగా అందించటానికి తపన పడుతున్నాడు  పోరాటం సాగినప్పుడు నువ్వు వాడి పక్కన ఉండి ఉండవచ్చు వాడి పక్షాన నిలిచి ఉండి ఉండవచ్చు వాడికి మద్దతిచ్చిండవచ్చు కానీ, నువ్వు గమనించలేదు నువ్వు వాడితో ఉన్నావు వాడికి ఉపయోగపడ్డావు అంతే  యుద్ధం జరిగేటప్పుడు వాడు అంటూనే ఉంటాడు ఉమ్మడి లక్ష్యం మనందరి గమ్యం అని యుద్ధం ముగిసాక కానీ తెలీదు సేనకు అది వాడి లక్ష్యం అని  మహాసేనా, తెలుసుకో/గుర్తుంచుకో యుద్ధపు విజయం ఎప్పుడూ నాయకుడిదే సైన్యం వాడికోసం యుద్ధం చేస్తూనే ఉండాలి లేదంటే మరో నాయకుడిని వెతుక్కోవాలి

నేనేం చేశానని ...

వంశీ కలుగోట్ల// నేనేం చేశానని ...// ****************************** ***** వాడూ నేనూ  పొలం గట్టు వెంట నడుస్తూ వెళుతున్నాం  'వ్యవసాయం చేయని నీకేం తెలుస్తుంది  ఇక్కడ మేం పడే కష్టం  కంపెనీల పేరునో రింగు రోడ్డుల పేరునో  పొలం అమ్ముకుని  చేతికి అందినదానితో పట్నం చేరితే  తప్పేమిటో చెప్పు' అన్నాడు  నిజమేనేమో కదా  వాడు పండిస్తే కొనటానికి  నా దగ్గర డబ్బుంది  వాడు పండించకపొతే  ఏమిటి అన్న భయమే తప్ప  వాడి ప్రస్తుతం గురించి  నేనేం చేస్తున్నానని  పొలం అమ్ముకోవద్దని చెప్పటానికి   వలస వెళ్లొద్దని ఆపటానికి

విశ్వ మానవుడు ...

వంశీ కలుగోట్ల// విశ్వ మానవుడు ...// ****************************** ******* బతుకు కోసం  పోరాటం సాగించినన్నాళ్ళూ  అవును, వాడికి  ఒక ప్రాంతీయత ఉండేది  ఒక కులమూ, మతమూ ఉండేది వాటిని వాడుకోవాలని  వాడుకుంటే ఎదగొచ్చని అనిపించేది  అవును, ఇప్పుడు  పోరాటం ముగియలేదు కానీ  ఆరాటం ఆగింది  ఆదరువు దొరికింది  పక్కనోడి గురించి కూడా  ఆలోచించే ఎదుగుదల వచ్చింది  ఎప్పుడో నేర్చుకున్న  అక్షరం  బుద్ధిని వికసింపజేసింది   ఇంకా వాడికి  ప్రాంతీయతలూ  కులాలూ  మతాలూ  అవసరమా  అవును, వాడిప్పుడు    విశ్వమానవుడు  కానీ,  అక్షరం సాయంతో  మార్పును తీసుకురావాలనే ధ్యేయంతో  ముందుకు సాగుతున్నానంటూ  స్వీయవంచన ఎందుకు  అక్షరానికి కూడా  ముసుగేసి సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడేమో  అక్షరాలలో  ఆదర్శాలన్నిటినీ ఒలకబోసుకుంటాడు  కానీ, ఆచరణలో  ప్రాంతానికి, వర్గానికి  పెద్దపీట వేస్తాడు  తనదీ ప్రాంతమని  తనదీ వర్గమని  గీసుకున్న గీతల్లోంచి  బయటకు రాలేక  అక్షరాల ముసుగులో  స్వీయవంచన చేసుకుంటూ  మేధావిగా మసలుకుంటూంటాడు  జిల్లాకొకటి  ప్రాంతానికొకటి 

వాటిని చెట్లు అంటారు ...

వంశీ కలుగోట్ల// వాటిని చెట్లు అంటారు ... // ****************************** ****************** భవిష్యత్తులో ఆరోజులు   అభివృద్ది అద్భుతాలను అరచేతిలో పెట్టిన రోజులు  ఒక్క ఫోన్ కాల్ చాలు  ఏదైనా అందుబాటులోకి వచ్చేస్తుంది  డబ్బు ఉండాలే కానీ  ఆకాశాన్ని కూడా  కాళ్ళ కింద పెట్టుకుని  రోజులు గడిపెయ్యోచ్చు  అభివృద్ది సాధించిన  అధ్బుతాలు అన్నీ ఇన్నీ కావు  కనే ఓపిక లేకపోతే  మనిషినే ప్రయోగశాలలో  తయారు చేసి తెచ్చుకోవచ్చు  ఆ భవిష్యత్తులో కూడా ఇప్పటిలానే పిల్లలు తమ ప్రశ్నలతో  తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు   కొడుకొచ్చి నాన్నను అడిగాడు  'నాన్నా ఏంటిది?' అని పుస్తకంలోని బొమ్మని చూపి  ఆ నాన్నకు గతం గుర్తొచ్చింది  రోడ్డు పక్కన  ఇంటి వసారాలో  మైదానాల చివరన  గుడిలో  బడిలో  నది పక్కన  చెరువు గట్టున  ఒకప్పుడు ఉండేవి అవి  పచ్చని ఆకులు  విశాలమైన కొమ్మలతో  ప్రాణవాయువు పంచుతూ  నీడనిస్తూ భూమిపై మనుగడ సాగించి  తన నీడన  మానవజాతిని ఎదగనిచ్చిన  దానిపేరు 'చెట్టు' అంటారు అని  చెప్పాడు  కొడుకుకు ఆ తండ్రి 

లక్ష్యం ఒక్కటే ...

వంశీ కలుగోట్ల// లక్ష్యం ఒక్కటే ... // ****************************** ********* రాతలో  అందాన్ని, శిల్పాన్ని  భాషలో  ఛందస్సును  పదాల పొందికనూ  నైపుణ్యాన్ని కాకుండా  అక్షరాల వెనుక  భావాన్ని, బాధని  అర్థం చేసుకోవడానికి  ప్రయత్నించు  యుద్ధం చెయ్యడమంటే  ఆయుధాన్ని పట్టుకోవటం  మాత్రమే కాదు  కావాలంటే  పురాణాలు పరిశీలించు  సాగరమధనం ఇచ్చిన అమృతం  ఏ యుధ్ధమూ ఇవ్వలేదు  వంద ఆయుధాలు  సాధించలేని మార్పు  ఏమో ఒక్క అక్షరం  సాధించగలదేమో  పాటనో  గేయమో  వచనమో  కవనమో  రూపమేదైతేనేం  లక్ష్యం ఒక్కటే  చైతన్యం 

జాగ్రత్త ...

వంశీ కలుగోట్ల// జాగ్రత్త ...// ****************************** ఒక్క నిమిషం తల పైకెత్తి చూడు  భూమి నిన్ను పడదోయాలని చూస్తుంది  ఒక్కసారి తల కిందకు వంచి చూడు  ఆకాశం అణగదొక్కాలని చూస్తుంది  ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని చూడు  పరిసరాలు పతనం చెయ్యాలని చూస్తాయి  పక్కవారే పామై కాటేయాలని చూస్తారు  నువ్వు అజాగ్రత్తగా ఉన్నంతకాలం  ప్రతివారూ నీ పక్కలో బల్లెమే  నువ్వు అప్రమత్తంగా వుంటేనే మనుగడ  విజయం సాధించాలంటే  ప్రమత్తత ఉండాలి  నువ్వు అప్రమత్తంగా ఉన్నప్పుడు  విజయం నీ వెంటే ఉంటుంది  ప్రపంచం నీ గులాము అవుతుంది  ఎప్పుడో పుష్కరకాలం కంటే క్రితం రాసుకున్నది, పాత నోట్ బుక్స్ తిరగేస్తుంటే కనిపించింది. కాస్త ఎడిట్ చేద్దామనుకున్నా ... కానీ అప్పటి నేను అలానే ఉంటే, అలానే ఉంచితే బావుండనిపించింది. 

సామాన్యులు ...

వంశీ కలుగోట్ల// సామాన్యులు ...// ****************************** ****** కథ చెబితే ఊ కొడతారు  నీతులు చెబితే చప్పట్లు కొడతారు  కబుర్లు చెబితే సమయం గడిపేస్తారు అయిదేళ్ళకోసారి అవసరానికొస్తారు  ఇచ్చిందేదో పుచ్చుకుని  అడిగినోడికి కాదనకుండా  తమ బతుకును అప్పగించేస్తారు గిల్లితే గిల్లించుకుంటారు  తిట్టినా, కొట్టినా పడతారు  భరించలేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు  ఎదురు తిరగటం తెలీని సాధుజీవులు  వీళ్ళంతా సామాన్యులు 

పోతున్నారు మహాత్ములు ...

వంశీ కలుగోట్ల// పోతున్నారు మహాత్ములు ... // *************************************************** అవతారాలెత్తిన దేవతలు  ఆలయాన బందీలయ్యారు  సంపాదనే లక్ష్యంగా సాగుతున్న కాలంలో  ప్రతిభకు అవకాశాలు లేక  వేరే ప్రాతిపదికన ఉద్యోగాలిస్తుంటే  ఉపాధి లేక నిరుద్యోగం  తిరగబడితే నక్సలిజం  బలైపోతున్న యువతరం  రక్షకులే భక్షకులై కబళిస్తుంటే మండుటెండల్లో విద్యావంతుడు  మండేగుండెలతో సామాన్యుడు  ఆకలిచావులు చస్తున్నారు  అన్యాయాలకు బలవుతున్నారు  పోగారుబోతులోకంతో పోటీపడలేక  పోతున్నారు మహాత్ములు  ఎప్పుడో పుష్కరకాలం కంటే క్రితం రాసుకున్నది, పాత నోట్ బుక్స్ తిరగేస్తుంటే కనిపించింది. కాస్త ఎడిట్ చేద్దామనుకున్నా ... కానీ అప్పటి నేను అలానే ఉంటే, అలానే ఉంచితే బావుండనిపించింది. పర్లేదులే పరిస్థితుల్లో కూడా పెద్దదా మార్పేమీ లేదనిపించింది ... 

మనిషి పుట్టుక ...

వంశీ కలుగోట్ల // మనిషి పుట్టుక ... // **************************************** పుట్టేముందు వాడు దేవుడిని అడిగాడు  రేపు నా గురించి ఎవరైనా చెప్పుకుంటే  నా గెలుపు గురించి కాకపోయినా  అది నా పోరాటం గురించి అయి ఉండాలి  సాధించిన విజయాలకన్నా  రగిలించిన స్ఫూర్తి గురించి అయి ఉండాలి  నా కులం గురించో, మతం గురించో కాదు  నా తీరు గురించి తత్త్వం గురించి అయి ఉండాలి  విగ్రహాలు పెట్టేంతటి భక్తి కాదు  నేను చూపించిన దారి గుర్తించగలగాలి  అంతా విని దేవుడు నవ్వి  'అయితే నిన్ను మనిషిగా పుట్టించడం సాధ్యం కాదు ఏదో ఒక జంతువుగా పుట్టించాలి' అన్నాడు 

... కావాలి

వంశీ కలుగోట్ల// ... కావాలి //  ****************************** 1 కులతత్వం తలకెక్కి  ఎందులోనో తెలియకపోయినా  సీనియర్ అనిపించుకునే  మగ ముసుగేసుకున్న మృగాలకి  రాగింగ్ అనే పేరు పెట్టుకుని  మానమో ప్రాణమో వదిలేసుకోవటానికి  ఒక అమ్మాయి కావాలి  2 గెలుపెలా వచ్చిందో తెలియకపోయినా  గెలిచి జనాల నెత్తిన కూచున్న  అధికారం ముసుగేసుకున్న క్రూరత్వపు  కోరలకి చిక్కి తన్నులు తినటానికి  బాధ్యత ఎరిగిన ఉద్యోగిగానో  నిరసన తెలుపటానికి వస్తే  ముళ్ళ లాఠీల దెబ్బలకు  బట్టలు  చింపేసుకోవటాని కో  కొంతమంది మహిళలు కావాలి  3 ఊరి మధ్యలోని పబ్బులోనో  ఊరవతలి ఫాం హౌస్ లోనో  తాగి తలకెక్కించుకున్న మద్యపు మత్తు  ఆడకుక్కైనా పర్వాలేదనే కోరికతో  మదమేక్కించి ఊపేస్తుంటే  నడిరోడ్డుపై చేయి లాగించుకోవటానికి  కొంతమంది ఆడవాళ్ళు కావాలి  4 పదో పాతికో లక్షలు  విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకోవడానికి ఉండి  గుడి అయితేనేం మరింకోటి అయితేనేం  అమ్మాయి అయితేనేం, అమ్మ అయితేనేం  నచ్చి సరే అంటే పొందు  నచ్చకపోతే వెంటాడి  వేటాడి చంపటానికి  కొంతమంది మహిళలు కావాలి  5 బడిలో