జాగ్రత్త ...

వంశీ కలుగోట్ల// జాగ్రత్త ...//
******************************
ఒక్క నిమిషం తల పైకెత్తి చూడు 
భూమి నిన్ను పడదోయాలని చూస్తుంది 
ఒక్కసారి తల కిందకు వంచి చూడు 
ఆకాశం అణగదొక్కాలని చూస్తుంది 
ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని చూడు 
పరిసరాలు పతనం చెయ్యాలని చూస్తాయి 
పక్కవారే పామై కాటేయాలని చూస్తారు 

నువ్వు అజాగ్రత్తగా ఉన్నంతకాలం 
ప్రతివారూ నీ పక్కలో బల్లెమే 
నువ్వు అప్రమత్తంగా వుంటేనే మనుగడ 

విజయం సాధించాలంటే 
ప్రమత్తత ఉండాలి 
నువ్వు అప్రమత్తంగా ఉన్నప్పుడు 
విజయం నీ వెంటే ఉంటుంది 
ప్రపంచం నీ గులాము అవుతుంది 

ఎప్పుడో పుష్కరకాలం కంటే క్రితం రాసుకున్నది, పాత నోట్ బుక్స్ తిరగేస్తుంటే కనిపించింది. కాస్త ఎడిట్ చేద్దామనుకున్నా ... కానీ అప్పటి నేను అలానే ఉంటే, అలానే ఉంచితే బావుండనిపించింది. 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...