ద్వి ...

వంశీ కలుగోట్ల // ద్వి ... //
*************************
మొదటి అడుగు పడినప్పుడు
వాళ్ళందరూ
'ఏం చేశాడురా?' అన్నారు

ప్రయాణం పూర్తయ్యాక
వాళ్ళందరూ
'ఏంచేశాడురా!' అన్నారు
*              *              *
వెలుతురు భరించలేక
వాళ్ళందరూ
చలువ కళ్లద్దాలు పెట్టుకున్నారు

రాత్రయ్యాక చీకటయ్యిందని
వాళ్ళందరూ
దీపాలు వెలిగించి కూచున్నారు
*              *              *
బతుకు కోసం ఊరొదిలితే
వాళ్ళందరూ
'పిరికోడు' అన్నారు

ఉద్యోగం కోసం దేశం వదిలితే
వాళ్ళందరూ
'గొప్పోడు' అన్నారు
*              *              *
పలకరింపుగా నమస్కరిస్తే
వాళ్ళందరూ
నన్ను పట్టించుకోలేదు

ఎన్నికలప్పుడు నమస్కరిస్తే
వాళ్ళందరూ
నన్ను నాయకుడని అన్నారు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...