నాకంతా నువ్వే ...
వంశీ కలుగోట్ల // నాకంతా నువ్వే ...//
*****************************************
కంటినుండి
ఒక నీటి చుక్క రాలిపడింది
అది ఆనందపు ఆలేమోననుకున్నాను
కానీ, అది నీ విరహంలో విషాదవీచిక అని
నిను చూసినపుడు తెలిసింది
నీ జ్ఞాపకాల్లో వున్నాననుకున్నాను
కానీ, అసలు నేనే లేనని
నీతో ఉన్నప్పుడు తెలిసింది
నాదంతా కవిత్వమనుకున్నాను
కానీ, అదంతా నీ రూపేనని
నిను కలిసినపుడు తెలిసింది
నను నీ దివ్యరూపం చూస్తూండనీ
అశృసృజన నయనాలతో నీ కోసం
వేచి చూస్తుండనీ ...
నువ్వే ... నాకంతా నువ్వే
నా సర్వస్వం నువ్వే
Comments
Post a Comment