లక్ష్యం ఒక్కటే ...

వంశీ కలుగోట్ల// లక్ష్యం ఒక్కటే ... //
***************************************
రాతలో 
అందాన్ని, శిల్పాన్ని 
భాషలో 
ఛందస్సును 
పదాల పొందికనూ 
నైపుణ్యాన్ని కాకుండా 
అక్షరాల వెనుక 
భావాన్ని, బాధని 
అర్థం చేసుకోవడానికి 
ప్రయత్నించు 

యుద్ధం చెయ్యడమంటే 
ఆయుధాన్ని పట్టుకోవటం 
మాత్రమే కాదు 
కావాలంటే 

పురాణాలు పరిశీలించు 
సాగరమధనం ఇచ్చిన అమృతం 
ఏ యుధ్ధమూ ఇవ్వలేదు 

వంద ఆయుధాలు 
సాధించలేని మార్పు 
ఏమో ఒక్క అక్షరం 
సాధించగలదేమో 

పాటనో 
గేయమో 
వచనమో 
కవనమో 
రూపమేదైతేనేం 
లక్ష్యం ఒక్కటే 
చైతన్యం 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...