మహానుభావులు ...
వంశీ కలుగోట్ల // మహానుభావులు ...//
***************************************
రాందేవ్ బాబా యోగా గురించి
తెగ రాతలు రాసి పడేస్తారు
బడ్డీ కొట్టు దగ్గర పని పిల్లాడు
తెచ్చి ఇచ్చిన చాయ్ తాగుతూ
చిదిమేయబడుతున్న బాల్యం గురించి
బారులో కూచుని బీరు తాగుతూ
పతనమవుతున్న ప్రజాస్వామ్యం గురించి
సగంబట్టల అమ్మాయిల డాన్సులు చూస్తూ
సంస్కృతీసాంప్రదాయాల గురించి
అబ్బో తెగ లెక్చర్లు దంచేస్తారు
ఎంతైనా మనవాళ్ళు మహానుభావులు
Comments
Post a Comment