నేను మనిషిని ...

వంశీ కలుగోట్ల// నేను మనిషిని ... //
***********************************
సూడు సిద్దప్పా నేను మనిషిని 
ఇలానే ఉంటానని గ్యారంటీ ఏమీ లేదు 
ఇప్పుడు ఇలా సెప్పానని సెప్పి 
నేను ఇలానే ఉంటానని అనుకుంటే అది నీ తప్పు 
నేను మారతానే ఉంటాను సిద్దప్పా 
అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి 
నాకు అందబోయే ఫలితాన్ని బట్టి 
ఆశతోనో, భయంతోనో ఏదో ఒకదాని కోసం 
నేను మారతానే ఉంటాను అప్పా 
అయినా మడిసి అన్నోడు మారతానే ఉండాలి 
పుట్టిన కాడి నుండి గిట్టే దాకా 
మారకపోతే మనిషికి మనుగడ లేదప్పా 
ఓరి సాంబో ఇది కూడా రాస్కోరా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...