'నీవు'గానే ...
వంశీ కలుగోట్ల // 'నీవు'గానే ... //
***********************************
ఓ అందమైన అమ్మాయీ
ఎందుకు ... ?
ఎపుడూ ఎవరితోనో
నిన్ను పోల్చాలనుకుంటావు
చందమామలాగానో
గులాబీలాగానో
మెరిసేతారకలాగానో
ఇంకెవరిలాగానో
మరెవరిలాగానో
ఎందుకివన్నీ?
ఎవరిలాగానో వున్నావనో
మరెవరినో మరిపిస్తావనో
నిన్ను ఇష్టపడలేదు
నిన్ను 'నిన్ను'గానే
ఇష్టపడ్డాను, ప్రేమించాను
'నీవు'గానే ఉంటేనే
ఇష్టపడతాను
నాకు
నీవు 'నీవు'గానే కావాలి
ఇంకెప్పుడూ
ఇంకెవరితోనో పోల్చమని
నిన్ను పొగడమని అనొద్దు
'నీవు'గానే ఉండు
'నీవు'గానే బావుంటావు
Comments
Post a Comment