శుభాకాంక్షలు
వంశీ కలుగోట్ల // శుభాకాంక్షలు //
************************************
సూర్యుడికన్నా ముందే
నీకు శుభాకాంక్షలు చెప్పాలనుంది
పరిమళించిన గులాబీని
నీ చెంతకు చేర్చాలనుంది
ఉషోదయ కిరణాల కాంతిలో
మెరిసే నీ కన్నుల్లో
నా సంతోషాన్ని చూసుకోవాలనుంది
చిరుగాలి స్వరాలు పేరుస్తోంటే
ప్రకృతి అంతా నా చెంత నిలిచి
నీకోసం ఎదురు చూస్తోంది
నాకన్నా ముందు నీకు
శుభాకాంక్షలు చెప్పాలని
Comments
Post a Comment