మనిషి పుట్టుక ...

వంశీ కలుగోట్ల // మనిషి పుట్టుక ... //
****************************************
పుట్టేముందు వాడు దేవుడిని అడిగాడు 

రేపు నా గురించి ఎవరైనా చెప్పుకుంటే 
నా గెలుపు గురించి కాకపోయినా 
అది నా పోరాటం గురించి అయి ఉండాలి 

సాధించిన విజయాలకన్నా 
రగిలించిన స్ఫూర్తి గురించి అయి ఉండాలి 

నా కులం గురించో, మతం గురించో కాదు 
నా తీరు గురించి తత్త్వం గురించి అయి ఉండాలి 

విగ్రహాలు పెట్టేంతటి భక్తి కాదు 
నేను చూపించిన దారి గుర్తించగలగాలి 

అంతా విని దేవుడు నవ్వి 
'అయితే నిన్ను మనిషిగా పుట్టించడం సాధ్యం కాదు
ఏదో ఒక జంతువుగా పుట్టించాలి' అన్నాడు 

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...