నన్ను నాకిచ్చెయ్యి

వంశీ కలుగోట్ల // నన్ను నాకిచ్చెయ్యి //
*******************************************
నాలోంచి నేను పారిపోవాలనిపిస్తుంది 
నీతో ధైర్యం చేసి మాట్లాడలేనప్పుడు 

నన్ను నేను కొత్తగా చూసుకున్నాననిపిస్తుంది 
నీ కళ్ళలో నన్ను చూసుకున్నప్పుడు 

నీతో మాట్లాడగలిగిన ప్రతిక్షణం 
ఒక జీవితమంత విలువైంది నాకు 

నీవు పాట పాడుతున్నప్పుడు 
నేను గాలినై అందులో కలిసిపోవాలనిపిస్తుంది 

అనుక్షణం నీ చూపు వెంటాడుతుంటే 
నీ ఊసులు మదిని కదిలిస్తుంటే 
పారిపోలేక నిను ప్రార్థిస్తున్నా 
నాన్ను నాకు తిరిగి ఇచ్ఛేయ్యామని ... 
ఎందుకంటే నాలోని నేను 
ఎప్పుడో నీ నీడనయ్యాను గనుక 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...