... ప్రేమించటానికే తీరిక లేదు

వంశీ కలుగోట్ల // ... ప్రేమించటానికే తీరిక లేదు //
********************************************************

వాడొచ్చాడు నా ఇంటికి 
అదేదో మతాన్ని, ఇంకేదో పద్ధతిని 
మనల్ని తిడుతున్న ఆ వర్గాన్ని 
ద్వేషించమన్నాడు 

పుట్టినతరువాత 
అందరూ అంటగట్టిన కులాన్ని/మతాన్ని 
పరిరక్షించుకోవాలంటూ 
నాకు కర్తవ్యబోధ చేయసాగాడు
'ప్రకృతిని, ప్రపంచాన్ని 
మానవత్వాన్ని, మనిషిని 
ప్రేమించటంలో 
నేను తీరికలేకుండా ఉన్నాను 
ద్వేషించేంతటి సమయం నాకు లేదు' 
అని చెప్పాను 

ఆ వర్గంలో/కులంలో/మతంలో 
చెడబుట్టానని తిడుతూ వెళ్ళిపోయాడు 
ఆ ఆవేశం చూస్తుంటే జాలేసింది 
అసలు తత్వం తెలుసుకోలేక 
గిరి గీసుకుని 
తనను తాను ఒక పరిమితుల చట్రంలో 
బంధించుకుంటున్న ఆ మేధావిని చూసి 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...