ప్రపంచాధినేతే అయినా ...
వంశీ కలుగోట్ల// ప్రపంచాధినేతే అయినా ... //
***************************************************
బావగారి వాక్కు ...
ఆయన వచ్చేవరకూ
రాయలసీమ ప్రజలకు
గొడ్డుకారం తప్ప
వేరే తిండి తెలియదు
మరిదిగారి ప్రవచనం ...
ఆయన వచ్చేవరకూ
తెలంగాణా ప్రజలకు
తెల్ల అన్నం అంటే
ఏమిటో తెలియదు
మిగతా ప్రాంతాల
ప్రజల పరిస్థితి
తెలుసుకోవాలని ఉందా
చూస్తూనే ఉండండి
బావామరుదుల ప్రవచనాలు
ప్రపంచానికి అధినేత అయినా
ఒక తల్లికి కొడుకే
అది పాచిపోయిన పాత సామెత
ప్రపంచానికి అధినేతే అయినా
పెద్ద కంపెనీకి సీఈఓ అయినా
ఏ దేశపు మంచోడైనా
బావ నుంచి స్ఫూర్తి పొందినోళ్లే
మరిది అండ చూసుకున్నోళ్ళే
Comments
Post a Comment