... అర్థమవ్వాలి

వంశీ కలుగోట్ల // ... అర్థమవ్వాలి //
*********************************
వాడు వేరు ఇంకోడు వేరని
అర్థం చేసుకోవటానికి
వాడికి గొడవ అవసరమయ్యింది
*             *             *
మాటకూ మౌనానికి మధ్య తేడా
అధికారమేనని తెలుసుకోవటానికి
వాడికి పదవి అవసరమయ్యింది
*             *             *
తనది అనుకున్న ప్రతిదీ
తనది కాదని తెలుసుకోవటానికి
వాడికి మరణం అవసరమయ్యింది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...