సామాన్యులు ...

వంశీ కలుగోట్ల// సామాన్యులు ...//
************************************
కథ చెబితే ఊ కొడతారు 
నీతులు చెబితే చప్పట్లు కొడతారు 
కబుర్లు చెబితే సమయం గడిపేస్తారు
అయిదేళ్ళకోసారి అవసరానికొస్తారు 
ఇచ్చిందేదో పుచ్చుకుని 
అడిగినోడికి కాదనకుండా 
తమ బతుకును అప్పగించేస్తారు
గిల్లితే గిల్లించుకుంటారు 
తిట్టినా, కొట్టినా పడతారు 
భరించలేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు 
ఎదురు తిరగటం తెలీని సాధుజీవులు 
వీళ్ళంతా సామాన్యులు 

Comments