కొన్ని కొన్ని అంతే భయ్యా ...

వంశీ కలుగోట్ల // కొన్ని కొన్ని అంతే భయ్యా ... //
***********************************************
కొన్ని అర్థం కావు
కొన్ని ఎంతకీ మారవు
కొన్ని ఎప్పటికీ అలానే ఉంటాయి
అదంటే ఆ తీరు మనకెక్కదు
అర్థమన్నట్టు నటిస్తూ ఉండాలంతే
*                *                *
పడేసిన ఖాళీ కాఫీ కప్పు
రీసైకిల్ పేరుతో పునరుజ్జీవనం పొంది
మళ్లీ కాఫీ నింపుకుని వచ్చింది
కానీ, కొత్త చొక్కామీద కాఫీ పడిందని
గొడవపడిన మేమిద్దరం మాత్రం
ఇప్పటికీ మళ్లీ కలవలేదు
*                *                *
పోయినేడాదికి ఇప్పటికీ
మా ఊరి దేవుడికి ఆదాయం పెరిగింది
ఉత్సవాలకు అలంకారాలు ఈసారి కేక
ఉత్సవాలకు పల్లకీ మోసే బోయీ మాత్రం
ఇప్పటికీ అలానే ఉన్నాడు
*                *                *
వాడు మాలో ఒకడుగా ఉండేవాడు
రెండేళ్ళక్రితం వఛ్చి అడిగాడు
మనం మనం ఒక కులపోళ్ళం
అవును కదా అడిగాడు కదా అని ఓటేశా
ఇప్పుడు వాడు బాగా ఎదిగిపోయాడు
ఓటేసిన మేమందరం అలాగే, అక్కడే ఉన్నాం
మా స్థాయిలు ఇప్పుడు మారిపోయినా
మా ఇద్దరి కులం మాత్రం ఇప్పటికీ ఒకటే
*                *                *
పాపం చేసినోడే గుడికి వెళతాడంట భయ్యా
నాకు తెలీక మొన్నామధ్యనే గుడికెళ్ళొచ్చా
ఇప్పుడు అందరూ నన్ను పాపిలా చూస్తున్నారు
పరిహారం ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...