వాటిని చెట్లు అంటారు ...
వంశీ కలుగోట్ల// వాటిని చెట్లు అంటారు ... //
************************************************
భవిష్యత్తులో ఆరోజులు
అభివృద్ది అద్భుతాలను
అరచేతిలో పెట్టిన రోజులు
ఒక్క ఫోన్ కాల్ చాలు
ఏదైనా అందుబాటులోకి వచ్చేస్తుంది
డబ్బు ఉండాలే కానీ
ఆకాశాన్ని కూడా
కాళ్ళ కింద పెట్టుకుని
రోజులు గడిపెయ్యోచ్చు
అభివృద్ది సాధించిన
అధ్బుతాలు అన్నీ ఇన్నీ కావు
కనే ఓపిక లేకపోతే
మనిషినే ప్రయోగశాలలో
తయారు చేసి తెచ్చుకోవచ్చు
ఆ భవిష్యత్తులో కూడా ఇప్పటిలానే
పిల్లలు తమ ప్రశ్నలతో
తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు
కొడుకొచ్చి నాన్నను అడిగాడు
'నాన్నా ఏంటిది?' అని
పుస్తకంలోని బొమ్మని చూపి
ఆ నాన్నకు గతం గుర్తొచ్చింది
రోడ్డు పక్కన
ఇంటి వసారాలో
మైదానాల చివరన
గుడిలో
బడిలో
నది పక్కన
చెరువు గట్టున
ఒకప్పుడు ఉండేవి అవి
పచ్చని ఆకులు
విశాలమైన కొమ్మలతో
ప్రాణవాయువు పంచుతూ
నీడనిస్తూ
భూమిపై మనుగడ సాగించి
తన నీడన
మానవజాతిని ఎదగనిచ్చిన
దానిపేరు 'చెట్టు' అంటారు అని
చెప్పాడు కొడుకుకు ఆ తండ్రి
Comments
Post a Comment