పోతున్నారు మహాత్ములు ...

వంశీ కలుగోట్ల// పోతున్నారు మహాత్ములు ... //
***************************************************
అవతారాలెత్తిన దేవతలు 
ఆలయాన బందీలయ్యారు 
సంపాదనే లక్ష్యంగా సాగుతున్న కాలంలో 
ప్రతిభకు అవకాశాలు లేక 
వేరే ప్రాతిపదికన ఉద్యోగాలిస్తుంటే 
ఉపాధి లేక నిరుద్యోగం 
తిరగబడితే నక్సలిజం 
బలైపోతున్న యువతరం 
రక్షకులే భక్షకులై కబళిస్తుంటే
మండుటెండల్లో విద్యావంతుడు 
మండేగుండెలతో సామాన్యుడు 
ఆకలిచావులు చస్తున్నారు 
అన్యాయాలకు బలవుతున్నారు 
పోగారుబోతులోకంతో పోటీపడలేక 
పోతున్నారు మహాత్ములు 


ఎప్పుడో పుష్కరకాలం కంటే క్రితం రాసుకున్నది, పాత నోట్ బుక్స్ తిరగేస్తుంటే కనిపించింది. కాస్త ఎడిట్ చేద్దామనుకున్నా ... కానీ అప్పటి నేను అలానే ఉంటే, అలానే ఉంచితే బావుండనిపించింది. పర్లేదులే పరిస్థితుల్లో కూడా పెద్దదా మార్పేమీ లేదనిపించింది ... 

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...