నేనేం చేశానని ...

వంశీ కలుగోట్ల// నేనేం చేశానని ...//
***********************************
వాడూ నేనూ 
పొలం గట్టు వెంట నడుస్తూ వెళుతున్నాం 

'వ్యవసాయం చేయని నీకేం తెలుస్తుంది 
ఇక్కడ మేం పడే కష్టం 
కంపెనీల పేరునో
రింగు రోడ్డుల పేరునో 
పొలం అమ్ముకుని 
చేతికి అందినదానితో పట్నం చేరితే 
తప్పేమిటో చెప్పు' అన్నాడు 

నిజమేనేమో కదా 
వాడు పండిస్తే కొనటానికి 
నా దగ్గర డబ్బుంది 
వాడు పండించకపొతే 
ఏమిటి అన్న భయమే తప్ప 
వాడి ప్రస్తుతం గురించి 
నేనేం చేస్తున్నానని 
పొలం అమ్ముకోవద్దని చెప్పటానికి 
వలస వెళ్లొద్దని ఆపటానికి

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...