'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ 
******************************************
మేఘమాలల గూల్చేడి మేరుపువోలె  ॥అహా॥
మేఘమాలల గూల్చేడి మేరుపువోలె
కటిక చీకటి చెండాడు కాంతివోలె 
పరాయి పాలన గూల్చేడి స్వాతంత్య్ర ప్రభనుబోలి 
భారతభూమిని తోచే ఆజాదు నడక  ॥తందాన తాన॥ 
. . .
. . .
. . . 
ఆంగ్లేయ ముష్కరుల గుండెల నిదురించిన సింహమురా ఆతడు ॥సై॥
స్వాతంత్రమే తన పేరని చెప్పిన మొనగాడురా ఆతడు ॥సై॥ 
మీసం మెలేసి సవాలు చేసిన 
భళిర భళిర భళి భళి భళి 
మీసం మెలేసి అరెరె మీసం మెలేసి 
సవాలు చేసిన 'ఆజాదు'రా ఆతడు 
. . . 
. . . 
. . . 
ధీరునివోలె ఎదురు నిలిచెరా ॥సై॥
ధైర్యంతో దెబ్బల స్వీకరించెరా ॥సై॥
'భారత మాతా కీ జై' యను మంత్రపఠనమే 
ఆతని బాధను హరియించేనురా  ॥ హరియించెనురా॥  ॥తన్దాన తాన॥ 
. . . 
. . . 
. . . 
ఊరూ వాడ ఈ గాఢ వినిరి ॥తం॥ 
వినినంతనే అచ్చెరువొందిరి ॥తం॥ 
ధీరబాలుని అభినందించ నిశ్చయించిరి ॥తం॥
అరెరె భళిర భళిర భళి భళి భళి 
వీరుడు వచ్చే ధీరుడు వచ్చే ॥ తం ॥
ఊరూ వాడా పిన్నా పెద్దా 
ముసలీ ముతకా కాకీ మేకా 
అంటా కదలి వచ్చెరా ॥ కదలి వచ్చెరా ॥  ॥ తం ॥
హారతులిచ్చి మాలలు వేసి స్వాగతించిరి ॥ తం ॥
వీర తిలకమూ నుదుట దిద్దిరిరా 
తరికిట ఝంతరి తరికిట ఝంతరి 

--- దాదాపు పది సంవత్సరాల క్రితం శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ గారి జీవితాన్ని బుర్రకథగా ప్రదర్శించాలని వ్రాసుకున్న "'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్" బుర్రకథ లోనిది ఇది. శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి పరిచయ ఘట్టం నుండి విప్లవోద్యమంలోకి ఆయన ప్రవేశం దాకా జరిగే క్రమలో వస్తుంది. ఇక్కడ పోస్ట్ చేయడం కోసం మధ్యలోని వచనం, హాస్యగాళ్ళ తందాన వాక్యాలు తొలగించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల బుర్రకథ ప్రదర్శన కుదరలేదు, ఇప్పటికీ ఆ ప్రతి అలానే దాచి ఉంచుకున్నాను ఎప్పటికైనా ప్రదర్శించాలి అని. చూద్దాం ... ఎప్పుడు వీలవుతుందో :)

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...