రెండోవైపు ...

వంశీ కలుగోట్ల// రెండోవైపు ... //
********************************
 
రెండో వైపు చూస్తే నీ కళ్ళు ఏమీ పోవు
భూమి బద్దలవ్వదు
ప్రపంచం ఉన్నట్టుండి అంతమవదు 

కులాన్ని మతాన్ని మరచి
ప్రాంతాల హద్దులు పక్కనపెట్టి
ఎవరో చెప్పినది
మరెవరో వ్యాఖ్యానించినది మూలన పెట్టి
ఒకవైపే చూపించే
ఒక వాదమే వినిపించే
గొంతుకలను వినవద్దు

రెండో వైపు చూడు
నువ్వు ఇన్నాళ్ళూ చూడని
ఆ రెండో వైపు ఉన్నది
బహుశా 'నిజం' కావొచ్చు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...