వెలుతురు ...

వంశీ కలుగోట్ల// వెలుతురు ... //
**********************************
ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది
నిద్దుర లేపేటందుకో
చీకట్లు పారదోలేందుకో తెలీదు కానీ
వచ్చీ రాగానే వెన్నుతట్టి నిలబెట్టి
నిన్నంతా నింపుకున్న కల్మషాలని వదిలించుకుని
మళ్ళీ ఇవాళ కొత్తగా
అమృతత్వం వైపు అలుపెరగని పయనం
చెయ్యటానికి కొత్త శక్తినిస్తూ పురిగొల్పుతోంది

ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది
మూసుకుపోయిన కళ్ళను తెరిపించి
నిజాన్ని చూపించాలని
మేదావిత్వపు పొరలు కమ్ముకుపోయి
నిజాన్ని గుర్తించలేని అజ్ఞానిగా మిగిలిపోతుంటే
ఆ పొరలు చీల్చి నిజం వైపు దారి చూపటానికి
కిరణాలను పంపుతూనే ఉంది 

ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది
గొర్రెల మందలో 
ఒకడా మేధావిత్వపు ముసుగు కప్పుకున్న మామూలోడా
ఇప్పటికైనా కళ్ళు విప్పి వెలుతురు చూడు
కళ్ళు మూసుకుంటే వెలుతురు పారిపోదు
నువ్వు చీకటిని చూస్తావంతే

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...