ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...


వంశీ కలుగోట్ల// ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...//
***********************************************
ధర్మాన్ని పాటించినవాడు
ధర్మం పక్షాన నిలబడ్డవాడు 
మానవత్వాన్ని నిలబెట్టినవాడు
రక్తం చిందించి మంచిని గెలిపించినవాడు
నిజాన్ని చెప్పినవాడు
అందరూ దేవుళ్లయ్యారు ఒకనాడు

దేవుడినే రక్షిస్తాననే వాడు 
గోప్పోడవుతున్నాడు ఈ రోజు 
సర్వహితం చెప్పే ధర్మాన్ని ఒకగాటన కట్టి 
మతానికి ముడేసేవాడు 
మానవత్వాన్ని మంటగలిపేవాడు 
మహాత్ముడుగా కొనియాడబడుతున్నాడు 

ఏ యజ్ఞంలో సమిధలుగా కాలిపోతున్నారో
ఎవరెందుకు చంపుతున్నారో తెలీకుండానే
హోటల్ లోనో, ధియేటర్ లోనో
క్రీడా ప్రాంగణంలోనో, రోడ్డు మీదనో
ఫ్రాన్స్, ఇరాక్, ఇరాన్
పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా
నేనున్నదో వేరే ఎవరో ఉన్నదో
దేశం ఏదైతేనేం చిచ్చు ఒకటే
మట్టిలో కలిసిపోతోంది మనుషులే

ఆధిపత్యం కోసం జరుగుతున్న ఆటలో
చెప్పుకోవడానికి వాదం ఏదైతేనేమి 
ఉగ్రవాదం ఊపిరి తీస్తున్నపుడు

దేవుడా రోజులు మారిపోయాయి
నీ పేరు చెప్పుకుంటున్న భక్తులను చూసి
మురిసిపోయి దిగి రావాలనుకుంటే
నీదే మతమో తెలుసుకుని రా
అది నీ భక్తులకు సమ్మతమో కాదో తెలుసుకుని మరీ దిగిరా
నువ్వూ ఏదో ఒక వాదం వైపు నిలబడకపోతే
నీ దైవత్వానికి నూకలు చెల్లిపోతాయి

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...