నా మౌనమా ...

వంశీ కలుగోట్ల// నా మౌనమా ... //
*************************************
నీకు లేఖ రాద్దామని కూచున్నా 
కానీ అక్షరాలూ జాలువారవేమీ
కలం ముందుకు కదలదేమి 
ఒక గొప్ప సందిగ్ధావస్థలో మునిగిపోయాను 
ఏమని సంబోధిస్తూ ఉత్తరం ప్రారంభించను?

ప్రియా అనా ప్రియతమా అనా 
ఉహూ ఇవేమీ రుచించట్లేదు 
నా భావాలకు ప్రతిరూపం నువ్వు
నాలోని శూన్యాన్ని పూరించిన ప్రేమవు నువ్వు 

కలం కాగితం తీసుకుని కూచున్నా 
కానీ ఈ మౌనం నా మనసును కప్పేస్తోంది 
నాలోని భావావేశాన్ని ఎగరేసుకుపోయింది 
ఈ మౌనం నా మాటను మూగవోయింపజేసింది 

ఇంకెలా ఇంకెన్నాళ్ళు భరించాలి ఈ భావావేశాలను 
అక్షరం అక్షరం వెతుక్కుని 
ఓర్పుతో కూచుని పేరుస్తూ 
నా భావాలన్నిటినీ మూటగట్టి 
ఈ ఉత్తరంలో ఒలకబోసుకుని 
ఝేండాగా నీ ముందు ఎగరేస్తున్నా

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...