మనిషివే కదా స్పందించు ...
వంశీ కలుగోట్ల// మనిషివే కదా స్పందించు ...//
***************************************
నువ్వెళుతున్నప్పుడు రోడ్డు మీద మొరిగిన కుక్క
ఎన్నికలప్పుడు గోడ మీద ప్రచారపు రాతలు
ఉదయం నుంచీ బస్టాండులో ఎదురుచూసినా
సాయంకాలానికి కానీ రాని 'పల్లె వెలుగు' బస్సు
ఎన్ని వందల అడుగులు బోరు తవ్వినాపడని నీరు
ఎంతమందికి ఇచ్చినా తిరిగి రాని ప్రేమ
ఏదిరా నిన్ను ప్రభావితం చెయ్యటానికి
నువ్వు కలం పట్టి కదనం చెయ్యటానికి అనర్హం
******************************

కష్టాలెన్నొచ్చినా ఎప్పటికీ రాని దేవుడు
దేవుడి పేరు చెప్పి మనిషిని చంపే మృగాలు
బాధ్యతలు మరిచి హక్కుల కోసం పోరాడే పౌరుడు
ప్రతి వారాంతంలో బీరు తాగుతూ
దేశం భవిష్యత్తు గురించి బాధపడేవాడు
దూలానికి వేలాడుతున్న రైతు శవం
యాసిడ్ కాల్చిన మొహంతో అమ్మాయి
ఎవరైతేనేం నీ కలంనుంచి సిరాచుక్కగా రాలటానికి

నిన్ను కదిలించటానికి మహా ప్రస్థానం కావాలా
మనిషివే కదా మరో మనిషి బాధ సరిపోదా
మనిషివే కదా మరో మనిషి బాధ సరిపోదా
Comments
Post a Comment