... మాటల్లేవ్

వంశీ కలుగోట్ల // ... మాటల్లేవ్ //
*****************************
రాసిందంతా చూసుకుంటే మాటలే కదా అనిపిస్తోంది 
నాదంతా కవిత్వమేనా?
ఏమో జనాలు లైకులు కొట్టినప్పుడు
కామెంట్లేసుకున్నపుడు అవునననిపిస్తుంది
ఊరికే వదిలేసినపుడు కాదేమోనని బాధేస్తుంది

సంశయంలో కొట్టుమిట్టాడుతుండగా
ఒకరోజు కల్లో తెనాలి రామలింగడు లాంటి పెద్దాయన కనిపించి
కవితోపదేశం చేసాడు
"ఈ మధ్యన తెలుగు సినిమాలు చూడట్లేదా
వారసులకు ఏమీ రాకపోయినా
వాళ్ళను జనాల మీదకి వదిలేసి
వాళ్ళే గొప్ప నటులని ఒప్పుకునేదాకా వదలట్లేదు కదా
అలాంటప్పుడు అంతో ఇంతో సరుకున్న నీకేమైందిరా
అలా రాస్తూ రాస్తూ ఉండు
ఏదో ఒకరోజు జనాలు ఒప్పుకోక చస్తారా చెప్పు
నువ్వూ గొప్పోడివేనని."

ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్
అంతా కవిత్వమే ... 😂

Comments

Popular posts from this blog

నివాళి

సూడు సిద్దప్పా ...

మా ఊరి బస్సు ...