దీపావళి పండగ రావాలి ...

వంశీ కలుగోట్ల// దీపావళి పండగ రావాలి ...//
************************************
ఒరేయ్ మగాడా
నీకేది అడ్డు
నీకెవరు ఎదురు
కదులుతున్న బస్సైనా
కదలని పొదలైనా
కళ్ళు మూసుకుపోయిన
కోరికకు ఏదైనా, ఎవరైనా ఒకటే

భరోసాతో నీ వెనుక నడిచేది
అమ్మాయైతేనేం పసిపాప అయితేనేం
చివరకి అమ్మ అయితేనేం

కోరల్లేని పాముల్లాగా
కొత్తవైతేనేం పాతవైతేనేం
చట్టాలు ఏమి చెయ్యగలవు

మగతనమంటే భరోసానివ్వటం అని
మరచిపోయి మృగాలైన మగ నరకాసులందరికీ
నరక చతుర్దశి లాంటి రోజొకటి రావాలి
అణిగిపోతున్న ఆడతనం
అపరశక్తి అవతారమెత్తే రోజు కావాలి
మిగిలిన అందరూ
దీపావళి పండగ జరుపుకోవటానికి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...