కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ...

వంశీ కలుగోట్ల// కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ... //
*********************************************************
1
నిజం కాలుస్తుందో లేదో కానీ
నిప్పు మాత్రం కాల్చి తీరతాది భయ్యా 

కావాలంటే
తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో
కాలిన బతుకుల అసలు లెక్క తీసి చూడు
నిప్పు ఎన్ని జీవితాలను బుగ్గి చేసిందో తెలుస్తుంది 
ఇప్పుడు ఇంకో తెలుగు రాష్ట్రంలో
హోదా కోసం, సాయం కోసం నిప్పంటించుకుంటోన్న
నిరాశావాదుల లెక్క చూడు

జీవితాలనే కాదు భయ్యా 
ఈ నిప్పు పంటలనీ కాల్చెస్తది
కావాలంటే మొన్నీమధ్య అమరావతి ప్రాంతంలో
భూములివ్వని రైతుల పొలాల్లో 
కాలిపోయిన పంటనడుగు చెబుతాయి

నిప్పుకు నిజంలానే పక్షపాతం లేదు
అయినా నిప్పుదేముంది పాపం అంటిస్తే అల్లుకుపోతాది
కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్యా
నిజం కాలుస్తాది అని అబద్ధం చెపుతున్నోడు మాత్రం 
ఎప్పటికీ ఉంటాడు

2
ఉసురు పోసుకున్నోడు ఉంటాడో పోతాడో 
తెలీదు కాని
ఉరితాడు మాత్రం ప్రాణాలు తీస్తది భయ్యా
 
కావాలంటే
కన్నీటితో పొలాన్ని తడపలేక
ఉరితాడుకు వేలాడుతున్న 
రైతన్నను అడిగి చూడు
రైతు ఉసురు పోసుకున్న రాజకీయ నాయకుడు
దర్జాగా దర్బారులో ఉంటె
నువ్వెందుకిలా వాసానికి వేలాడుతున్నావని 

*              *              *
కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు భయ్యా
అవి అంతే
నిప్పులా కాల్చేస్తయ్
ఉరితాడులా ప్రాణాలు తీస్తాయ్

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...