నేను చెబితే నమ్ముతాడా ...
వంశీ కలుగోట్ల// నేను చెబితే నమ్ముతాడా ... //
**********************************************
ఇవ్వాళ వాడిని ప్రశ్నిస్తున్నానని
నేనేవరని అడుగుతున్నాడు
అయిదున్నర అడుగుల దేహాన్నని చెప్పనా ******************************
ఇవ్వాళ వాడిని ప్రశ్నిస్తున్నానని
నేనేవరని అడుగుతున్నాడు
ఏదో ఒక ఇజం పేరు చెప్పుకుని
ఎవడో ఒకడి చంకనెక్కి తిరిగేది బహుశా వాడేమో
ఎవడికీ తలవంచని
సంకెళ్ళకు బెదరని అక్షరం లాంటోడిని నేను
అహంకారంతో అంధత్వం కమ్మినవాడికి
కలంపోటుతో మేలుకోకపోతే
అసహనం ఉప్పెనలా కమ్మేస్తుందని
నేను చెబితే నమ్ముతాడా
నెత్తికెక్కిన కళ్ళు నేలమీదికి దిగొచ్చేదాకా
నమ్మి అందలమెక్కించిన ఓటే
వెన్నుపోటు పొడిస్తే కూలదోయగలదని
నేను చెబితే నమ్ముతాడా వాడు
నరనరాన నిండిన వంచకత్వంపై
సామాన్యుడి ఓటు పోటు పడేదాకా
Comments
Post a Comment