నేను - నీ ఏకాంతం ...

వంశీ కలుగోట్ల// నేను - నీ ఏకాంతం ... //
************************************
ఒక్కసారి నీ ఇంటికొచ్చానా
అంతే ... ఇక ప్రపంచం మొత్తం
తలుపు ఆవలే నిలబడిపోతుంది 
నన్ను నీ ఏకాంతంలోకి విసిరేసి 

నీ సన్నిధిలో గడిపే సమయంతోనైనా
కాసింత ప్రేమ ఒలకబోస్తానేమోనని
తలుపు బయటే ఎదురు చూస్తోంది ఆశగా 

నా పక్కన నిలబడి
ఒకే ఊపిరి పీల్చుకునేంత దగ్గరగా నువ్వుండి
నువ్వే నేనైపోతుంటే
రాయటానికి సమయమెక్కడిది
అనాధప్రపంన్ని పట్టించుకునే తీరికెక్కడిది

నీ ఏకాంతంలోంచి
నన్ను ఎప్పుడు పంపుతావో తెలీదు
కానీ వెళ్ళేటప్పుడు మాత్రం
వెళ్తూ వెళ్తూ వెలుతురు కిరణాలను
మూటగట్టుకెళ్ళే సాయంత్రంలా
కొంత ప్రేమను జ్ఞాపకాలుగా మోసుకెళతా
అక్షరాలుగా ఒలకబోసుకోవటానికి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...