అభ్యంతరం ...

వంశీ కలుగోట్ల// అభ్యంతరం ...//
********************************
 
కలలన్నీ కరిగిపోతుంటే
స్వార్థం విశ్వరూపం ముందు
సామ్రాజ్యం కూలిపోతుంటే
ఘనతంతా గతమైపోతుంటే
గద్గద స్వరంతో అపస్వరాల సమ్మిళితంగా
పాడాలా "వందేమాతరం" అంటూ


భవిత భయపెడుతూంటే
భరతమాత అన్న భావననే
కూల్చి పాతరేస్తున్న ఈ
రాజకీయాలు అంతమొందిన నాడే

చెప్పే శుభాకాంక్షలకు విలువ 
అపుడు చెపుతాను శుభాకాంక్షలు

అయినా నా అభ్యంతరం 
నేను చెప్పే శుభాకాంక్షలు 
ఎవడిక్కావాలి కాబట్టి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...