ఉదయాన్ని చూడాలని ...

వంశీ కలుగోట్ల// ఉదయాన్ని చూడాలని ... //
******************************
************
1
ఈ ఇరుకు గదిలో
ఉత్తరం గోడకు నేను దక్షిణం గోడకు నీవు
ముఖాలు వేలాడేసుకుని కూర్చున్నాం
తూరుపు దిక్కున వెలుగొస్తుందనే నమ్మకంతో

ఎడతెరిపిలేని మౌనం
తుఫానులా ముంచెత్తుతోంటే
పేరుకున్న అంతరాల పొరలు
బెర్లిన్ గోడలా ఎపుడు పగులుతాయా అని
ఎదురుచూస్తూ కూచున్నాం
చట్రాల మధ్య ఇరుక్కుపోయిన భావాలతో
మాటలు వెతుక్కుంటూ

2
ఉదయాన్ని చూడాలని
ఉబలాటపడుతున్నాడు వాడు
తుపాకి అంచున జీవితాన్ని గడుపుతూ
చీకటిని చీల్చాలని
అలుపెరగని పోరాటం చేస్తున్నవాడు

3
ఏ దేవుడైనా
పూజలు, ప్రార్థనాలయాలు కావాలంటే
ఆ దేవుడు
తన మనిషికి డబ్బొచ్చేలా చెయ్యాలి

4
ఉరకలెత్తే నదికి అడ్డుకట్ట వేసి
విద్యుత్తును పుట్టించే
నైపుణ్యం ఉన్నవాళ్ళే తప్ప
కంపుగొడుతున్న బురదగుంటను
బాగుపరచటానికి
మహాత్ములెవరూ కదలట్లేదు

5
నువ్వు నడిచొచ్చిన
బాట వెంట
నా రక్తపు మరకలు కనబడలేదా

కలిసి నడుద్దామంటే
ఇప్పుడు
కత్తులు దింపుతున్నావు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...