నువ్వూ - నేను: మనం

వంశీ కలుగోట్ల// నువ్వూ - నేను: మనం //
******************************************
ఆదుకుంటుందని నమ్మిన హస్తం
అణగదోక్కేస్తూ
సర్వ భ్రష్టత్వం పట్టించినపుడు
కలగని బాధ, లేవని గొంతుకలు
ఒక వికసించిన కమలం
తల్లోనో చెవిలోనో పెట్టుకోలేమని
విప్లవిస్తున్నాయెందుకో 

మేధావిత్వం అంటే
మూలాలను వెతికి నిజాన్ని చెప్పటం
అంతేకానీ
ఏదో ఒక వాదపు తప్పెట మోతకు
తందానా పలకటం కాదు 

నువ్వూ నేనూ అంటూన్నంతకాలం
వాదాల గోడలు విభేదాలు పుట్టిస్తూనే ఉంటాయి
ఆ గోడలు పగలాలంటే
'మనం' అనగలిగే దమ్ము ఉండాలి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...